వివాహ రిజిస్ట్రేషన్లు సులభతరం
ఫీజులు పెంచినప్పటికీ పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వివాహ రిజిస్ట్రేషన్లను మరింత సులభం చేస్తున్నట్లు పేర్కొంది. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కోసం ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో వివాహ రిజిస్ట్రేషన్లు అమలు చేస్తుండగా, త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకూ హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాన్యువల్‌గా రిజిస్టర్ చేస్తున్నారు. వివాహ రిజిస్ట్రేషన్ కు పెళ్లిఫొటోలు, పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఆధార్ కార్డ్‌లు, ముగ్గురు సాక్షులతో రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు ఓ ఫామ్ పూర్తి చేసి సబ్ రిజిస్ట్రార్‌కు అందజేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆ వివరాలు సరిచూసి పుస్తకంలో నమోదు చేస్తారు. ఆ తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇకపై ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లో అమలు చేయనున్నారు. www.registrations.ap.gov.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.