16 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లురాష్ట్రంలో 16 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు(New Corporations) ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. ముదిరాజ్, యాదవ కుర్మ, లింగాయత్, పద్మశాలి, పెరక, బలిజ కార్పొరేషన్ల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెడ్డి, వైశ్య, మాదిగ, మాదిగ ఉపకులాల, మాల, మల ఉపకులాల కార్పొరేషన్ల ఏర్పాటు చేయనున్నామన్నారు. ఏకలవ్య, బంజారా, ఆదివాసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.
Source link