Health Care

కొత్త ఫ్లేవర్ తో పానీపూరీ.. టేస్ట్ ఎలా ఉందో చూడాలి మరి..


దిశ, ఫీచర్స్ : ఇండియన్ ఫుడ్ లో చాలామంది ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ పానీపూరి. దాని పేరు వింటేనే చాలు నోట్లో లాలాజలం ఊరిపోతుంది. పానీపూరి అన్న మాట వింటే చాలు ఎంత దూరమైనా అలా వెళ్ళిపోతారు. ఈ పానీపూరి కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రుచిని కలిగి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో పానీపూరి పై కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. మరి ఆ వివరాలేంటో ఆ ప్రయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా పానీపూరీలో బంగాళాదుంపలు, బఠానీలు, సేవ్ వేసి ఉంటాయి. కానీ ఈ పానీపూరి బండి అతను మాత్రం పానీపూరీలో యాపిల్స్, డ్రాగన్ ఫ్రూట్స్, పైనాపిల్ ని వేసి ఇస్తున్నాడు. ఇలాంటి పానీపూరీని మీరు ఎప్పుడూ చూసి తిని ఉండరు కదా. మరి ఈ పానీపూరి ఎక్కడ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ప్రత్యేకమైన పానీపూరీలు జైపూర్‌లో కనిపిస్తాయట. వైరల్ అయిన వీడియోలో ఫుడ్ వెండర్ మొదట ఆపిల్‌లను చిన్న ముక్కలుగా చేసి, ఆపై డ్రాగన్ ఫ్రూట్స్, తరువాత పైనాపిల్ ని కట్ చేశాడు. ఆ తర్వాత మూడింటిని మిక్స్ చేసి, వాటిని గోల్గప్పల్లో నింపుతాడు. తర్వాత పెరుగుతో పాటు, దానిమ్మ, బీట్రూట్ తో సహా వివిధ పదార్థాలతో గార్నిష్ చేసి ప్రత్యేకమైన గొల్గప్పను సిద్ధం చేస్తాడు. ఈ వింత ఫుడ్ కాంబినేషన్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో జైపూర్‌హంగర్_స్టోరీస్ అనే ఐడితో షేర్ చేశారు.

ఈ వీడియోను చూసిన ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘ఇంతకంటే దారుణంగా ఏదైనా చేస్తే చస్తా’ అని ఒక యూజర్ కోపంగా రాస్తే, ‘పండ్లు, గోల్గాప్ప రెండింటి రుచిని చెడగొట్టావు’ అని మరొకరు రాశారు. అదే విధంగా మరో యూజర్ ‘ఇది తయారు చేసిన అన్నయ్య కూడా సిగ్గుతో ముఖానికి ముసుగు కప్పుకున్నాడు’ అని కోపంగా రాయగా, ‘అలాంటి వారిని పబ్లిక్ క్షమించదు’ అని ఒకరు కామెంట్ చేశారు.



Source link

Related posts

ఇదేం ఫ్యాషన్ షో రా బాబు.. మోడల్స్‌పై చెత్త, కూల్ డ్రింక్స్ విసిరిన ప్రేక్షకులు.. వీడియో వైరల్

Oknews

రాంగ్ పర్సన్‌ సిగ్నల్ అంటే ఏమిటి?.. సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది?

Oknews

ఫెయిర్‌నెస్ క్రీముల‌వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Oknews

Leave a Comment