Top Stories

కొనసాగుతున్న ట్రెండ్.. లిస్టులోకి మరో 2 సినిమాలు


టాలీవుడ్ లో రీ-రిలీజెస్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. అయితే బిజినెస్ మేన్, పోకిరి, ఖుషి లాంటి 3-4 సినిమాలు తప్పిస్తే, మిగతా బ్లాక్ బస్టర్స్ అన్నీ ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఛత్రపతి అయితే ఘోరంగా దెబ్బతింది. ఈ సినిమాను ప్రభాస్ ఫ్యాన్స్ కూడా పట్టించుకోలేదంటే రీ-రిలీజెస్ ట్రెండ్ ఎటు పోతుందో అర్థం చేసుకోవచ్చు.

ఇక రీ-రిలీజెస్ అపేస్తే బెటర్ అనే చర్చ మొదలైన తరుణంలో, మరో 2 సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. వీటిలో ఒకటి శంకర్ దాదా ఎంబీబీఎస్. చిరంజీవి నటించిన ఈ రీమేక్ సినిమాను ఈ వీకెండ్ విడుదల చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ట్రయిలర్ కూడా కట్ చేశారు.

ఈ ట్రయిలర్ ను నాగబాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రయిలర్ రిలీజ్ చేసిన తర్వాతే, నాగబాబు, తన కొడుకు పెళ్లి కోసం ఇటలీ వెళ్లారు. ఈ సినిమా పెద్ద హిట్టవుతుందని అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఎందుకంటే, ప్రస్తుతం థియేటర్లలో గట్టిగా నిలబడిన సినిమా లేదని, వీకెండ్ కూడా పెద్ద సినిమాలు లేవనేది వీళ్ల వాదన.

ఇక నవంబర్ నెలలో రీ-రిలీజ్ కు సిద్ధమైన మరో సినిమా అదుర్స్. ఎన్టీఆర్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను నవంబర్ 18న రీ-రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి సినిమా థియేటర్లలోకొచ్చి చాన్నాళ్లయింది. కాబట్టి అదుర్స్ రీ-రిలీజ్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. అందుకే గట్టిగా ప్రచారం చేస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమా టీజర్ ను ఏకంగా 400 థియేటర్లలో ప్రసారం చేశారు.

ఇలా నవంబర్ నెలలో అలనాటి 2 పెద్ద హిట్స్ మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి. రీ-రిలీజ్ ట్రెండ్ ను ఇవి కొత్త పుంతలు తొక్కిస్తాయా లేక గుంపులో కలిసిపోతాయో చూడాలి.



Source link

Related posts

తెలంగాణ కాంగ్రెస్‌కు సీనియర్ల గండం!

Oknews

సెంటిమెంట్ చోటు నుంచి వైసీపీ శంఖారావం

Oknews

పాచిపోయిన విమర్శలు.. పాత కాంగ్రెస్ లో కొత్త షర్మిల..!

Oknews

Leave a Comment