Entertainment

కొబ్బరికాయ బదులు తలకాయ కొట్టిన విజయ్‌ దేవరకొండ!


విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గీత గోవిందం’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్‌’. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ‘గీత గోవిందం’ చిత్రానికి పూర్తి భిన్నంగా ఫ్యామిలీతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతోంది.

‘లైన్‌లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు… టైమ్‌కి లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూలుకు పంపించడాలనుకున్నావా… సెటిల్‌మెంట్‌ అంటే’ అని విలన్‌ అజయ్‌ఘోష్‌ అన్న డైలాగ్‌కి విజయ్‌దేవరకొండ ఆన్సర్‌ ఇస్తూ ‘భలే మాట్లాడతారన్నా మీరందరూ.. ఏ.. ఉల్లిపాయలు కొంటే,. వాడు మనిషి కాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటి’ అంటూ అక్కడే ఉన్న ఒక ఐరన్‌ పైప్‌ను చేత్తో వంచేస్తాడు.. ఆ తర్వాత అడ్డొచ్చిన విలన్‌ అనుచరుడి తలను గోడకేసి గట్టిగా కొట్టి ‘సారీ బాబాయ్‌.. కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయాను… తలకాయ కొట్టేసాను’ అంటాడు.  ఈ గ్లింప్స్‌ సినిమా మీద ఎంతో ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తోంది. విజయ్‌ దేవరకొండను ఒక కొత్త యాంగిల్‌లో చూపించేందుకు పరశురామ్‌ ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌ ‘గీత గోవిందం’ చిత్రాన్ని మ్యూజికల్‌గా ఎంత పెద్ద హిట్‌ చేసాడో తెలిసిందే. మరోసారి అతన్నే తన సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంచుకున్నాడు పరశురామ్‌. దానికి తగ్గట్టుగానే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదరగొట్టాడు. 



Source link

Related posts

chandramukhi-returns-sequel-tamil-p-vasu-declares – Telugu Shortheadlines

Oknews

RRR దర్శకుడు రాజమౌళిని కొట్టి చంపుతాం…బీజేపీ ఎంపీ బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్…

Oknews

ప్రభాస్ రాజా సాబ్ కి  సాయం చేస్తున్న చిరంజీవి ఫ్యాన్స్

Oknews

Leave a Comment