హాల్టింగ్ స్టేషన్హాల్టింగ్ స్టేషన్ ఏర్పాటుతో లక్షలాది మంది భక్తులకు ప్రయోజనం కలగనుంది. నాలుగు రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనానికి ఏటా దాదాపు 25 నుంచి 30 లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. అందులో 70 శాతం మంది సామాన్య భక్తులే ఉంటారు. వారంతా ఆర్టీసీ బస్సులలో, ఇతర ప్రైవేట్ వాహనాలలో ఆలయానికి చేరుకుంటారు. అయితే బస్సుల్లో వచ్చే వారికి రాజీవ్ రహదారి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని కొమురవెల్లికి చేరుకుంటారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు భక్తులు, ప్రయాణికులు ప్రధాన రహదారిపై గంటల సమయం నిరీక్షించాల్సి వచ్చేది. ఇక హైదరాబాదు నుంచి వచ్చే భక్తులు 110 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి వచ్చే వారు 90 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ …. రెండు, మూడు వాహనాలు మారాల్సిన పరిస్థితి వచ్చేది. హైదరాబాద్ నుంచి ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.150, కరీంనగర్ నుంచి రూ. 100 ఖర్చు అవుతుంది. రైలు ప్రయాణం అయితే సగం భారం తగ్గే అవకాశం ఉంటుంది. కొమురవెల్లి సమీపంలో రైల్వే స్టేషన్ ఏర్పాటుతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగనుందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
Source link
previous post