EntertainmentLatest News

కొరియన్ స్టార్ మా డాంగ్ సియోక్ తో ప్రభాస్ గొడవ!  ఇటలీలో ఎంజాయ్ 


ఏ ఫర్ యాపిల్, బి ఫర్  బాట్ ఎలాగో ఇప్పుడు పి ఫర్ ప్రభాస్(prabhas)తాజాగా మొన్న విడుదలైన  కల్కి (kalki)తో మరోసారి తన కట్ అవుట్ కి ఉన్న  స్టామినా ని చాటి చెప్పాడు. దీంతో తన గత చిత్రాల కోవలోనే కల్కి  వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. ఇప్పటి వరకు అధికారంగా  తొమ్మిది వందల కోట్ల రూపాయలని సాధించాడు. అవి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతాయో చెప్పలేం.ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభాస్  న్యూ మూవీలో పలానా  యాక్టర్ ఉండబోతున్నాడనే  చర్చ  జరుగుతుంది.  ఇప్పుడు ఆ  న్యూస్ వైరల్ గా మారింది.

ప్రభాస్ సినీ డైరీలో ఉన్న  ప్రాజెక్ట్ లలో  సందీప్ రెడ్డి వంగ (sandeep reddy vanga)స్పిరిట్ (spirit)కూడా ఒకటి. లేటెస్ట్ యానిమల్ (animal)హిట్ తో మంచి ఊపు మీద ఉన్న సందీప్  డార్లింగ్ మూవీని  అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. కథ విషయంలో గాని నటుల విషయంలోగాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇందుకు నిదర్శనంగా ప్రముఖ కొరియన్ స్టార్ మా డాంగ్ సియోక్ (ma dong seok)ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఒక పవర్ ఫుల్ విలన్ పాత్రలో సియోక్ కనిపించబోతున్నాడని అంటున్నారు. సందీప్ అధికారంగా ఈ విషయాన్నీ ప్రకటించకపోయినా సియోక్ ఎంట్రీ న్యూస్ నిజమే అని అంటున్నారు అదే జరిగితే ఇండియా సినీ ప్రేమికులంత అదృష్టవంతులు మరొకరు ఉండరని చెప్పవచ్చు. స్పిరిట్ లో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ క్యారక్టర్ చెయ్యబోతున్నాడు.

ఇక సీయోక్ విషయానికి వస్తే తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో  ఎంతటి వారినైనా కట్టిపడేయ్యగలడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి  ఎంతో మంది అభిమానులు ఉన్నారు. 2012 లో వచ్చిన ది నైబర్ తో సీయోక్ నట ప్రస్థానం మొదలయ్యింది. నేమ్ లెస్ గ్యాంగ్ స్టార్, ది అన్ జస్ట్, ట్రైన్ తో బుసాన్,బాడ్ గయ్స్, ఎటర్నల్స్, స్క్వాడ్ ఇలా సుమారు యాభై ఒకటి సినిమాలకి పైగానే చేసాడు. ఇక ప్రభాస్ ప్రస్తుతం ఇటలీ లో తన సినీ సెలవులని ఎంజాయ్ చేస్తున్నాడు. స్పిరిట్ కాకుండా  సలార్ 2 ,రాజాసాబ్, హను రాఘవ పూడి సినిమాలు  ప్రభాస్ చేతిలో ఉన్నాయి. రాజా సాబ్ అయితే  కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. బహుశా ఈ మూవీనే నెక్స్ట్ రిలీజ్ అయ్యే ప్రభాస్ మూవీ అవ్వచ్చు.

 



Source link

Related posts

మీరు థియేటర్లకి రావటం లేదు కదా.. అందుకే మీ ఇంటికి వస్తున్నా!

Oknews

జపాన్ లో రష్మిక..ఇండియా తరుపున మొదటి వ్యక్తి గా రికార్డు 

Oknews

రీ ఎంట్రీ ఇచ్చేందుకు లండన్‌ నుంచి దిగిన నాగార్జున హీరోయిన్‌!

Oknews

Leave a Comment