దిశ, ఫీచర్స్: ప్రస్తుతం గుండె జబ్బులు, హృదయనాళాల్లో ఆటంకం వంటి ఆరోగ్య సమస్యలు గతం కంటే పెరిగిపోతున్నాయని నిపుణులు అంటున్నారు. వైద్య పరమైన పరిష్కారాలు, చికిత్సలు ఉన్నప్పటికీ, నివారణ ఉత్తమమైన మార్గమని చెప్తున్నారు. కొన్ని రకాల ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలను తరచుగా తీసుకోవడంవల్ల శరీరంలో కొవ్వు కరిగిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. అవేంటో చూద్దాం.
* బ్రోకలీ: మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే హైరిచ్ ప్రోటీన్ కూరగాయల్లో బ్రోకలీ ఒకటి. వాస్తవానికి ఇది పోషకాల గని అంటుంటారు నిపుణులు. ఎందుకంటే ఇందులో 90 శాతం నీటు, ఏడు శాతం, కార్బొహైడ్రేట్లు, మూడు శాతం ప్రోటీన్లు ఉంటాయి. కొవ్వు పదార్థాలు అసలే ఉండవు. దీనిని ఆహఆరంలో భాగంగా తీసుకోవడంవల్ల శరీరంలో కొలెస్ట్రాల్ బర్న్‌గా పనిచేస్తుందని, బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుందని, ప్రాణాంత వ్యాధుల రిస్కును తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు.
* పింటో బీన్స్: వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు. గ్రామాల్లో్ ఎక్కువగా వాడుతుంటారు. ఈ గింజల్లో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉండటంవల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా శరీరంలో కొవ్వును కరిగించే గుణం కూడా బొబ్బర్లకు ఉందంటున్నారు డైటీషియన్లు. వీటిని ఆహారంగా తీసుకోవడంవల్ల ఈటింగ్ డిజార్డర్ సమస్య కూడా తగ్గుతుంది. పైగా బాడీలోని ఫ్యాట్‌ను కరిగించడంలో, రక్తంలోని చక్కెరస్థాయిలను నియంత్రించడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు.
* పప్పు ధాన్యాలు : పప్పు ధాన్యాలు సహజంగానే ఆరోగ్యానికి మంచివి. కందులు, పెసలు, మినుములు వంటి దాదాపు అన్ని రకాల పప్పు ధాన్యాలు శరీరంలో కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడతాయి. విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ ఉండటంవల్ల ఎనర్జీని ఇవ్వడంతోపాటు కండరాలను బలోపేతం చేస్తాయి. మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటివి కలిగి ఉండటంవల్ల అదర్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
* గ్రీన్ బఠానీలు : కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ కె వంటి అనేక పోషకాలు కలిగిన ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్‌గా గ్రీన్ బఠానీలు ప్రసిద్ధి చెందాయి. వీటిని డైట్‌లో చేర్చుకోవడంవల్ల శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా కంటి ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి కూడా గ్రీన్ బఠానీలు మేలు చేస్తాయి.
* శనగలు : శరీరంలో కొవ్వును కరిగించగల గుణం శనగల్లోనూ మెండుగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు ఉండటంవల్ల జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. క్రానిక్ డిసీజెస్ నివారణలోనూ శనగలు అద్భుతంగా పనిచేస్తాయి. పైన పేర్కొన్న ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్స్ అన్నీ కొవ్వును బర్న్ చేయడం కారణంగా గుండె జబ్బులు, హృదయ నాళాల్లో ఆటంకాలు వంటి సమస్యలను సహజంగానే నివారిస్తాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.
*గమనిక:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.