Health Care

కోకిల తన గుడ్లను కాకి గూటిలోనే ఎందుకు పెడుతుందో తెలుసా?


దిశ, ఫీచర్స్ : పక్షుగూళ్లను అందరూ చూసే ఉంటారు. పంటపొలాల్లో ఉండే గింజలను తింటూ అక్కడే గూడు కట్టుకొని ఉంటాయి.కానీ ఈ మధ్యకాలంలో కొన్ని పక్షులు ఇంటి ఆవరణంలో కూడా గూళ్లు కట్టుకుంటున్నాయి. ఇక అన్ని పక్షులు గుడ్లు పెట్టే సమయంలోపు గూడును నిర్మించుకుని వాటిలో గుడ్లు పెట్టి,పిల్లల్ని చేసి, వాటికి రెక్కలు వచ్చి ఎగిరేంత వరకు పోషిస్తాయి. కానీ కోకిల మాత్రం అలాకాదండోయ్.. కాస్త డిఫరెంట్. కోకిల తాను గుడ్లు పెట్టే సమయానికి తనలాగే నల్లగా ఉండే కాకి గూడును వెతికి దానిలో గుడ్లు పెడతుంది.

అసలు అది ఎందుకు ఇలా చేస్తుదంటే. దానికి ఓ బలమైన కారణం ఉంది. నిజానికి కోకిలకు గూడు కట్టుకోవడం రాదంట, అందుకే కోకిల గుడ్లు పెట్టే సమయానికి గుడ్లు పెడుతున్న కాకి గూడును వెతికి వాటిలో గుడ్లు పెడుతుంది. అలా గుడ్లను ఏ గూటిలో పెడుతుందో గుర్తు పెట్టుకొని ఆ గూటిని నిత్యం గమనిస్తూనే ఉంటుంది. ఇక కాకులు కోకిల గుడ్లను.. వాటి గుడ్లే అనుకుని పొదిగి పిల్లల్ని చేస్తాయి. తీరా అవి కొంచెం పెద్దయ్యాక.. పిల్లల అరుపుల ఆధారంగా కాకి పిల్లలు కాదని తెలుసుకుని గూటి నుంచి బయటకు తరిమేస్తాయి. అప్పుడు మాత్రమే తల్లి కోకిల వాటి పిల్లల్ని సంరక్షించుకుంటుంది.



Source link

Related posts

రాత్రి వేళ ఈ పండ్లను తినొద్దని చెబుతున్న వైద్యులు.. ఎందుకంటే..?

Oknews

మునక్కాయలు అతిగా తింటున్నారా.. అయితే, వీటి గురించి తప్పక తెలుసుకోండి

Oknews

మహిళల్లో ఈ ఐదు లక్షణాలు ఉంటే ప్రమాదంలో ఉన్నట్లే!

Oknews

Leave a Comment