Entertainment

కోటి మంది సబ్ స్క్రైబర్లతో సరికొత్త చరిత్ర సృష్టించిన ‘తెలుగువన్’


తెలుగువారి వారధి, సారధి, నేటి డిజిటల్ యుగానికి నాంది ‘తెలుగువన్’. దేశవిదేశీ ప్రజలకు ఇంటర్నెట్ ద్వారా తెలుగు సినిమాను చూపించవచ్చని.. ఖండాంతరాలకు చూపించి చరిత్ర సృష్టించిన భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ ప్లాట్ ఫామ్ ‘తెలుగువన్’.

24 ఏళ్ళ క్రితం.. డిజిటల్ మీడియా శక్తి గురించి గానీ, అసలు యూట్యూబ్ అనే ఫ్లాట్ ఫామ్ ఉంది అని గానీ ఎవ్వరికీ అవగాహన లేనప్పుడే భారతదేశం నుండి యూట్యూబ్ తో టైఅప్ చేసుకున్న ఏకైక డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ‘తెలుగువన్’. స్వయంగా సాంకేతికనిపుణులైన కంఠంనేని రవిశంకర్ భవిష్యత్ లో డిజిటల్ మీడియాదే రాజ్యమని ముందుగానే ఊహించగలిగారు. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేసి, నూటికి నూరుశాతం విజయం సాధించి తెలుగువన్ ని అత్యున్నత శిఖరాన ఉంచగలిగారు. యూట్యూబ్ లో అంచలంచలుగా ఎదుగుతూ మహావృక్షంలా ఎదిగిన ‘తెలుగువన్’ తాజాగా 10 మిలియన్ సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకుంది.

తెలుగువన్ కి 300 కి పైగా అనుబంధ ఛానల్స్ ఉన్నాయి. మొత్తంగా 80 మిలియన్ కి పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో.. తెలుగువన్ గానీ, అనుబంధ ఛానల్స్ గానీ ఎప్పుడూ తాము గీసుకున్న లక్ష్మణరేఖను దాటలేదు. విలువలు, నీతి, మర్యాదలే అలంకారాలుగా ‘తెలుగువన్’ సగర్వంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. న్యూస్, కరెంట్ అఫైర్స్, భక్తి, వ్యవసాయం, కిడ్స్ కంటెంట్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు, స్టాండప్ కామెడీ, మెడికల్ అండ్ హెల్త్ ఇలా ఎన్నో విభాగాల్లో.. నాణ్యత, ప్రమాణాలతో కూడిన మంచి కంటెంట్ ను అందిస్తోంది.

యువ ప్రతిభావంతులైన రచయితలు, దర్శకులు, నటీనటులు, సంగీత దర్శకులు, గాయకులు మరియు గీత రచయితలు.. ఇలా ఎందరికో తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సహాయపడిన మొదటి డిజిటల్ ప్లాట్‌ఫామ్ తెలుగువన్ నెట్‌వర్క్. తెలుగువన్ ని వేదికగా చేసుకొని ఎందరో వర్ధమాన నటీనటులు, రచయితలు, గాయకులు, దర్శకులు తమ ప్రతిభను నిరూపించుకొని తెలుగు సినీ పరిశ్రమ నుంచి అవకాశాలు పొందారు. ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్స్ గా వెలుగొందుతోన్న ఎందరో నటులు, దర్శకులు ఒకప్పుడు తెలుగువన్ నుంచి వచ్చినవారే.

నాణ్యమైన, అర్థవంతమైన కంటెంట్ ను అందిస్తున్న తెలుగువన్ ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. తెలుగువన్ ని ఆదరిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తాజాగా సింగిల్ యూట్యూబ్ ఛానల్ లో 10 మిలియన్ సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకొని తెలుగువన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. సౌత్ ఇండియాలోనే మొదటి యూట్యూబ్ ఛానల్ గా ప్రయాణం మొదలుపెట్టి, నేటితో కోటి మంది సబ్ స్క్రైబర్లను సంపాదించుకున్న సందర్భంగా మా విజయంలో భాగమైన వారందరికీ తెలుగువన్ తరపున కృతఙ్ఞతలు.



Source link

Related posts

మళ్ళీ బాలకృష్ణ తన అభిమాని మీద ప్రేమ చూపించాడు

Oknews

అసెంబ్లీలో పవన్‌కళ్యాణ్‌.. పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ వైరల్‌!

Oknews

హూ ఈజ్ మై డాడీ..అంటున్న యాదమ్మ రాజు

Oknews

Leave a Comment