Telangana

కోదాడ బీఆర్ఎస్ లో ముదిరిన వివాదం, స్వతంత్ర అభ్యర్థిగా శశిధర్ రెడ్డి పోటీ!-kodad brs dissident leaders ready to contest independent if bollam mallaiah candidate ,తెలంగాణ న్యూస్


అసమ్మతి నేతల ఆత్మీయ సమావేశం

కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్ ప్రకటించడానికి ఆరు నెలల ముందు నుంచే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దన్న డిమాండ్ తో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు నాయకత్వంలో పార్టీ నాయకులు శశిధర్ రెడ్డి, ఎర్నేని బాబు, మహ్మద్ జానీ, పాండురంగారావు తదితర నాయకులు జట్టుకట్టి ప్రయత్నిస్తున్నారు. కానీ, వీరి అసమ్మతిని ఏ మాత్రం పట్టించుకోని పార్టీ హై కమాండ్ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కే టికెట్ కట్టబెట్టింది. ఇక, అప్పటి నుంచి ఈ అసమ్మతి నాయకులు మరింతగా తమ వాదనలు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలను దగ్గరకు తీసి బుజ్జగిస్తున్న నాయకత్వం కోదాడ విషయంలో ఇంకా చొరవ చూపడం లేదు. దీంతో తమ తమ మద్దతు దారులతో అసమ్మతి నాయకులు తాజాగా మరో మారు సమావేశమై కోదాడ టికెట్ తమలో ఒకరికి ఇవ్వాల్సిందేనని, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ టికెట్ రద్దు చేయాల్సిందేని పట్టుబడుతున్నారు.



Source link

Related posts

CM Revanth Review : అక్రమాలను అడ్డుకోవాలి.. తిష్ట‌వేసిన అధికారుల‌ను బ‌దిలీ చేయండి

Oknews

TS Republic Day: నియంతృత్వాన్ని ప్రజలు సహించరు, ఎన్నికల ఫలితాలే నిదర్శనం- గవర్నర్ తమిళ సై

Oknews

నిజామాబాద్‌లో అంతా రామజపమే.. వైభవంగా సీతారామ కళ్యాణం

Oknews

Leave a Comment