Telangana

కోదాడ బీఆర్ఎస్ లో రాజీనామాల కుదుపు-kodad brs dissident leaders resigned ready to join congress ,తెలంగాణ న్యూస్


అభ్యర్థిని మార్చనందుకు తిరుగుబాటు

కోదాడ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కే ఈసారి కూడా టికెట్ ఇచ్చారు. టికెట్లు ప్రకటించిన రోజు నుంచే ఇక్కడి నాయకులు ఆయన టికెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైకమాండ్ ను కలిసి ఎమ్మెల్యేకే టికెట్ ఇస్తే తాము పనిచేయలేమని తేల్చి చెప్పారు. తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా.. ఎవరైనా బీసీ నాయకుడికే టికెట్ ఇచ్చినా తామంతా కలిసి పనిచేసి గెలిపించుకుంటాం కానీ, బొల్లం మల్లయ్య యాదవ్ ను మార్చాల్సిందేనని పట్టుబట్టారు. కానీ, గులాబీ అగ్ర నాయకత్వం వీరి విన్నపాలను పట్టించుకోలేదు. సరికాదా ఇటీవలే బొల్లం మల్లయ్య యాదవ్ కు బి-ఫారం కూడా అందజేసింది. దీంతో ఇక లాభం లేదని ఈ నాయకులంతా బహిరంగంగానే తిరుగుబాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, ఉద్యమ నాయకుడు కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ పాండురంగారావు, నియోజకవర్గ నాయకులు మహ్మద్ జానీ, ఎర్నేని బాబు, వివిధ మండలాలకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు రాజీనామాల బాటపట్టారు.



Source link

Related posts

సిద్దిపేట సబ్ స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం, పలు మండలాలకు నిలిచిన విద్యుత్ సరఫరా-siddipet news in telugu fire accident at sub station electricity supply stopped ,తెలంగాణ న్యూస్

Oknews

Goa Tour Package : హైదరాబాద్ టు గోవా

Oknews

హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి గ్రీన్ సిగ్నల్, జాతీయ రహదారిగా ప్రకటనకు ప్రతిపాదనలు-hyderabad news in telugu cm revanth reddy meets central minister nitin gadkari requests approval for national highways ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment