EntertainmentLatest News

క్లైమాక్స్ ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్న పూరి జగన్నాధ్


తన కెరీర్ మొదట నుంచి ఎన్నో విభిన్నమైన సినిమాలని ప్రేక్షకులకి అందించిన దర్శకుడు పూరి జగన్నాధ్.(puri jagannadh)పైగా ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలు అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా నడకని మార్చివేశాయి. అలాగే ఆయన దర్శకత్వంలో నటించిన హీరోకి ఒక స్టార్ డమ్ వస్తుంది. తాజాగా ఆయన తన  స్వీయ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్  చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఆ  సినిమాకి సంబంధించిన  న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.

పూరి జగన్నాధ్ అండ్  ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని( ram pothineni)ల కలయికలో  వస్తున్న  డబుల్ ఇస్మార్ట్ మీద రామ్ అండ్ పూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ కి పూరి అండ్ యూనిట్  ప్లాన్ చేస్తుంది. త్వరలో జరగబోయే  షెడ్యూల్ లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో  క్లైమాక్స్ ఫైట్ ని  చిత్రీకరించబోతున్నారు.సినిమాకి ఆయువుపట్టుగా నిలిచే  ఈ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లను అద్భుతంగా తెరకెక్కించాలని పూరి టీమ్  అన్ని రకాలుగా కసరత్తులు చేస్తుంది. 

ఇక ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ ల్లో   రామ్ యాక్షన్ విజువల్స్ వండర్ ఫుల్ గా ఉండబోతున్నాయి. ముఖ్యంగా రామ్, విలన్ ల  మధ్య వచ్చే  ఫైట్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉండబోతున్నాయని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని  పూరి కనెక్ట్స్  పై పూరి జగన్నాథ్ అండ్ ఛార్మీ(charmi) లు నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8  2024న తెలుగు, తమిళ,  కన్నడ, మలయాళ మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.రామ్ పోతినేని పూరి కాంబోలో 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ రూపుదిద్దుకుంటుంది.

 



Source link

Related posts

‘కన్నప్ప’ చిత్రంలో మరో ఎంట్రీ.. రంగంలోకి దిగుతున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో!

Oknews

మాకు పాత పూరి జగన్నాథ్ కావాలి!

Oknews

KTR Fires On Congress And BJP | చాయ్ అమ్ముకోవాలి దేశాన్ని కాదంటూ ప్రధాని మోదీపై పరోక్ష విమర్శలు | KTR Fires On Congress And BJP

Oknews

Leave a Comment