Khammam ACB Raids : ఖమ్మంలో ఓ హెడ్ కానిస్టేబుల్ రూ. 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఖమ్మం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న కోటేశ్వరరావు సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. కుటుంబ వివాదం నేపథ్యంలో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసుకు సంబంధించి నోటీసును జారీ చేసే విషయంలో కానిస్టేబుల్ కోటేశ్వరరావు బాధితుడి నుంచి రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారు. ఆస్తి వివాద నేపథ్యంలో కూతురు తండ్రిపై చీటింగ్ కేసు పెట్టింది. ఈ కేసుకు సంబంధించి విచారణ కూడా కొనసాగుతోంది. కాగా 41 సీఆర్పీ కింద నిందితుడికి నోటీసు జారీ చేయాల్సి ఉంది. హైకోర్టు సైతం నోటీసు జారీ చేయాలని ఆదేశించింది. అయితే ఇదే అదునుగా భావించిన హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావును రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ సిబ్బంది సోమవారం మధ్యాహ్నం వలపన్ని కోటేశ్వరరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుని కుమారుడి నుంచి రూ.50,000 లంచం తీసుకుంటున్న క్రమంలో అవినీతి నిరోధక శాఖ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ను పట్టుకున్నారు.
Source link