తెలుగుదేశం పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ అని సీనియర్ నేతలు పద్నాలుగు మందితో ఒకటి ఏర్పాటు చేసింది. చంద్రబాబు జైలులో ఉన్న ఈ సమయంలో సీనియర్లతో కూడిన ఈ కమిటీయే పార్టీకి దిశా నిర్దేశం చేస్తూ ముందుకు నడపనుంది. ఈ కమిటీలో విశాఖ జిల్లా నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితలకు చోటు దక్కింది.
మరో సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అవకాశం దక్కలేదు. ఇటీవల కాలంలో గంటా బాగా యాక్టివ్ అయ్యారు. జగన్ మీద డైరెక్ట్ గా విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ వెళ్ళి మరీ లోకేష్ బాబుకు బాసటగా ఉండి వచ్చారు.
విశాఖలో బాబు అరెస్ట్ ని నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. అయితే టీడీపీ అధినాయకుడి చంద్రబాబు సూచనలతో ఏర్పాటు చేసిన పొలిటికల్ యాక్షన్ కమిటీలో మాత్రం అయ్యన్నకే ప్రాధాన్యత ఇచ్చారు. గంటా ఎంత పోరాటం చేసినా ఆయనను సైడ్ చేశారని అంటున్నారు.
టీడీపీలో అయ్యన్న మొదటి నుంచి ఉంటూ వస్తున్న నమ్మకం అయిన నాయకుడు కాబట్టే ఆయనకు చంద్రబాబు చినబాబు ఎపుడూ ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. పార్టీ కోసం ప్రాణం ఇస్తాను అని బాహాటంగా చెప్పగలిగే నేత కూడా అయ్యన్న అని అంటారు. అయ్యన్న ఫైర్ బ్రాండ్. బాబు కళ్ళలో ఆనందం కోసం జగన్ మీద ఎన్ని అయినా విమర్శలు చేస్తారు. ఆయన మీద పదిహేను కేసులు కూడా ఉన్నాయి. పొలిటికల్ యాక్షన్ కమిటీలో కూడా అయ్యన్న లాంటి ఫైర్ బ్రాండ్ అవసరం అనే తీసుకున్నారుట.