Health Care

గర్భిణులకు అలర్ట్.. పిండాన్నీ వదలని మైక్రోప్లాస్టిక్స్.. ఏం జరగనుందో!


దిశ, ఫీచర్స్ : ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకం, వివిధ ప్లాస్టిక్ వస్తువుల తయారీ కారణంగా వెలువడే మైక్రోప్లాస్టిక్స్ మానవ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. ప్లాస్టిక్‌కు గురికావడంవల్ల మానసిక రుగ్మతలు, చర్మ సమస్యలు, క్యాన్సర్లు వస్తాయని నిపుణులు ఎన్నోసార్లు హెచ్చిరించారు. అయితే తాజా అధ్యయనం మరో భయంకరమైన విషయాన్ని వెల్లడించింది. ఏంటంటే.. మైక్రోప్లాస్టిక్స్ గర్భిణలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, పిండం ఎదుగుదలకు ఆటంకంగా మారుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో హెల్త్ సైన్సెస్ పరిశోధకులు గుర్తించారు.

పరిశోధనలో భాగంగా రీసెర్చర్స్ 62 మంది గర్భిణుల నుంచి రక్తం, మూత్రం, పిండంలోని టిష్యూస్ వంటి శాంపిళ్లను సేకరించారు. అయితే ఈ సందర్భంగా ల్యాబ్‌లో పరిశీలించగా ప్రతి ఒక గ్రాము కణజాలంలో 6.5 నుంచి 790 మైక్రోగ్రాముల మైక్రో ప్లాస్టిక్‌ ఉన్నట్లు కనుగొని ఆశ్చర్యపోయారు. ఈ పరిణామం భవిష్యత్తులో మానవ మనుగడకే ముప్పువాటిల్లే హెచ్చిరికగా పరిశోధకులు చెప్తున్నారు. గర్భిణుల్లో మైక్రోప్లాస్టిక్స్ ఉండటం వారి ప్రసవ సమయాన్ని కఠినతరం చేయడమే కాకుండా పిండం ఎదుగుదలను అడ్డుకుంటాయి. కొంతమందికి నెలలు నిండకుండానే అబార్షన్ కావచ్చు. కొందరికి ప్రసవం తర్వాత పిల్లలు బలహీనంగా, మానసిక రుగ్మతలు కలిగిన వారిగా పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టే విధానాలు ప్రపంచ దేశాలు అవలంభించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Read More..

తల్లిదండ్రులు పెట్టే శాపనార్థాలు పిల్లలకు తగులుతాయా?



Source link

Related posts

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కంటే మా జీతమే ఎక్కువంటున్న డెలివరీ బాయ్.. ఎన్ని లక్షలంటే..?

Oknews

Constipation: ఎన్ని మందులువాడినా మలబద్ధకం తగ్గటల్లేదా.. అయితే, వీటిని ట్రై చేయండి

Oknews

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలా.. ఈ 4 తప్పులు అస్సలే చేయకూడదు!

Oknews

Leave a Comment