ప్రస్తుతం తెలుగునాట ఎక్కడ చూసినా విశ్వక్ సేన్ నయా మూవీ గామి గురించే చర్చ. మోస్ట్ లీ విశ్వక్ సేన్ సినీ కెరీర్ లోనే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న మూవీ కూడా ఇదే. ఇక తెలుగు రాష్ట్రాల్లో గామి అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి. దీంతో గామి హంగామా స్టార్ట్ అయ్యిందని చెప్పవచ్చు.ఇక ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడు థియేటర్ లో షో పడుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ న్యూస్ ఒకటి హాట్ టాపిక్ గా నిలిచింది.
ఓవర్ సీస్ లో గామి గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. విశ్వక్ సేన్ గత సినిమాలు రిలీజ్ కానన్ని థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రీ సేల్స్ అంటే అడ్వాన్స్ బుకింగ్స్ ఒక లెవల్లో జరిగాయి. లక్ష డాలర్స్ మార్క్ ని గామి సాధించింది. ఇదొక రికార్డు అని చెప్పవచ్చు. ఈ విషయాన్నీ గామి ని రిలీజ్ చేసిన శ్లోక ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఒక పోస్టర్ ద్వారా తెలిపింది.మూవీ బాగుందనే టాక్ వస్తే కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.
విశ్వక్ సేన్ తో కలిసి చాందిని చౌదరి, అభినయ, దయానంద్ రెడ్డి, మొహమ్మద్ సమస్ లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. విద్యాధర్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీలో నటించిన ఆల్ యాక్టర్స్ నుంచి ఆల్ టెక్నీషియన్స్ దాకా అందరు ఎన్నో కష్టాలకి ఓర్చి మూవీని కంప్లీట్ చేసారు.కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ మరికొందరితో కలిసి గామిని నిర్మించింది. అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ విడుదలలో భాగస్వామ్యం అయ్యింది. ఈ సంస్థ ప్రస్తుతం చిరంజీవి తో విశ్వంభర ని తెరకెక్కిస్తోంది.