విశ్వక్ సేన్ నయా మూవీ గామి. ప్రెజంట్ ఎంటైర్ తెలుగు స్టేట్స్ లో గామి ఫీవర్ స్టార్ట్ అయ్యింది. మహా శివరాత్రి కానుకగా ఎనిమిదిన మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అంటే ఇంకో రెండు రోజుల్లో సిల్వర్ స్క్రీన్ మీద అధ్బుతాలు సృష్టించడానికి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో వేగం పెరిగింది. విశ్వక్ సేన్ వరుసగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
గామి కి విద్యాధర్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. గామి ని ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేద్దామని దర్శకుడ్ని అడగలేదని చెప్పాడు. కానీ ఈ మధ్యన కాంతార మూవీ అడుగుజాడల్లో నడవాలనే ఆలోచన వచ్చిందని చెప్పిన ఆయన ఆ మూవీ ఎలా అయితే రెండు వారాల తర్వాత మిగతా భాషల్లో రిలీజ్ అయ్యిందో గామి ని కూడా అలాగే రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చాడు. కాకపోతే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే వేరే బాషల్లో రిలీజ్ ఉంటుందంటనే విషయాన్నీ కూడా చెప్పాడు.ఇలా ఇతర భాషలలో ఆలస్యంగా విడుదల చెయ్యడం మంచి నిర్ణయమే అని కూడా ఆయన చెప్పుకొచ్చాడు .
ఇక ఇటీవల వచ్చిన ట్రైలర్ తో విశ్వక్ సేన్ అభిమానులు,ప్రేక్షకులు గామి కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. చాందిని చౌదరి, అభినయ, మొహమ్మద్ సమద్, హారిక పెద్దాడ, దయానంద్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.విశ్వనాద్ రెడ్డి ఫోటోగ్రఫీని అందిస్తుండగా నరేష్ కుమారన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ పతాకంపై కార్తీక్ శబరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ కూడా విడుదల విషయంలో భాగస్వామ్యం అవుతుంది.