సూపర్‌స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో పదేళ్ల తర్వాత తెరకెక్కుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’. ఇప్పటి వరకు మహేష్ మాస్ యాంగిల్‌లో చూపించిన దర్శకులు చాలా తక్కువ మంది. అయితే తాను మాత్రం ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా సూపర్‌స్టార్‌ను చూపిస్తానని అంటున్నారు త్రివిక్రమ్. ఆ మధ్య వచ్చిన గ్లింప్స్‌లోని మహేష్ లుక్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ చేయటానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అల వైకుంఠపురములో చిత్రం తర్వాత త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ‘గుంటూరు కారం’ కావటంతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఈ అంచనాలకు ధీటుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం మేరకు మహేష్ తన ‘గుంటూరు కారం’తో రీజనల్ మార్కెట్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారట. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఏకంగా రూ.120 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ కలెక్షన్స్ మూవీ బాక్సాఫీస్ దగ్గర రాబడుతుందో లేదో చూడాలి.
అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ ఇది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే మూడోసారి మాత్రం వీరిద్దరూ ఎలాగైనా బ్లాక్ బస్టర్ సాధించాలని టైమ్ తీసుకుని మరీ సినిమా చేస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తమన్ సినిమాకు సంగీత సారథ్యాన్ని వహిస్తున్నారు. ఈ మూవీ కోసం మహేష్ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించబోతున్నారు. జగపతి బాబు ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మూవీ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.