సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మొన్న సంక్రాంతికి వచ్చి రికార్డు స్థాయి కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది. ఆ ఏరియా ఈ ఏరియా అనే తేడా లేకుండా ఆల్ ఏరియాస్ కూడా మహేష్ వన్ మాన్ షో తో గుంటూరు కారం తన సత్తాని చాటుతు ముందుకు దూసుకుపోతుంది. తాజాగా గుంటూరు కారం ఒక నయా రికార్డు ని క్రియేట్ చేసింది.
గుంటూరుకారంలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ఇనిస్టాగ్రమ్ లో వన్ మిలియన్ రీల్స్ తో సరికొత్త చరిత్ర సృష్టించింది. తమన్ సంగీత సారధ్యంలో తెరకెక్కిన ఈ సాంగ్ తెలుగు ప్రేక్షకులని ఒక ఊపు ఊపుతుంది అనడానికి ఆ పాటకి వచ్చిన రికార్డు స్థాయి రీల్స్ నే ఒక ఉదాహరణ. కుర్చీ మడత పెట్టి సాంగ్ పాటకి మహేష్ శ్రీ లీలలు చేసిన డాన్స్ అయితే మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులని కూడా థియేటర్స్ లో డాన్స్ చేసేలా చేసింది. అసలు ఈ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు థియేటర్ లో తిన్నగా కుర్చీల్లో కూర్చున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువే ఉంటుంది. మహేష్ 20 ఏళ్ళు వెనక్కి వెళ్లి మరి స్టెప్స్ వేసాడు.
ఇక శ్రీలీల సంగతి చెప్పక్కర్లేదు. డాన్స్ రాని వాళ్ళకి సైతం డాన్స్ చెయ్యాలని అనిపించేలా ఆ సాంగ్ కి పెర్ ఫామ్ ఇచ్చింది. టోటల్ గా ఆ పాటలో మహేష్ శ్రీ లీల లు అలుపన్నది లేకుండా ఇరగదీసారు. అందుకే అందరు మహేష్ శ్రీలీల ల స్టయిల్లో కుర్చీ మడత పెట్టి పాటకి డాన్స్ చేస్తున్నారు.పైగా ఈ సాంగ్ ప్రవాహం కూడా ఇప్పట్లో తగ్గేలా లేదు. అలాగే మిగతా సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి మూవీ ఘన విజయంలో వన్ ఆఫ్ ది రీజన్ గా నిలిచాయి.