Health Care

గుండె సమస్యలు రాకుండా ఉంటాలంటే ఈ మూడు సూత్రాలు పాటించాల్సిందే..!


దిశ, ఫీచర్స్: ఈ బిజీ షెడ్యూల్డ్ లైఫ్‌లో హెల్త్ గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే అనారోగ్యాలతో మృతి చెందే వారి సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇక వీటిలో రికార్టు స్థాయిలో నమోదవుతున్న మరణాల్లో గుండె సమస్య ఒకటి. ఈ మధ్య కాలంలో గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య ఎక్కువై పోతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఆడుతూ, పాడుతూ కనిపించిన వాళ్లు కూడా హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్నారు. గుండె జబ్బులకు అనేక కారణాలు ఉండొచ్చు అంటున్నారు నిపుణులు. వీటిలో అతి ముఖ్యమైనవి

తగినంత నిద్ర లేకపోవడం, బరువు పెరగడం, ధూమపానం లేదా మద్యం సేవించడం. ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవిన శైలిలో చిన్న చిన్న మార్పులు తప్పవు అంటున్నారు నిపుణులు. మీ బిజీ లైఫ్‌లో ఈ మూడు సూత్రాలు కనుక పాటించినట్లయితే గుండె సమస్యలను కొంచెం వరకు తగ్గించవచ్చట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* అధిక రక్తపోటు గుండె జబ్బులకు మూలకారణమని అందరికీ తెలిసిందే. కాబట్టి, బీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా చెక్ చేయించుకుంటూ ఉంటాలి. అంతే కాకుండా తిండి విషయంలో అనేక జాగ్రత్తలు తసుకోవాలి. మంచి నిద్రతో పాటు సోడియం తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీని ద్వారా రక్తపోటును కాస్త అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

* ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది ఉభకాయ సమస్యతో ఎక్కవగా సతమతువుతున్నారు. బయట దొరికే జంక్ ఫుడ్స్ తీసుకోవడం, లేదా జన్యూన్ పరంగా కూడా కొంత అధిక బరుతో బాధపడతారు. అలాంటి వారికి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వారు తమ ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన స్నాక్స్ లాంటి చేర్చుకుంటే కాస్త బెటర్ ఉంటుంది. అంతే కాకుండా వ్యాయామం, యోగా లాంటివి కూడా చేస్తుండాలి.

* అయితే చాలా మందికి వ్యాయామం చేసే అలవాటు ఉండదు. కొందరికి చేసే టైం ఉండదు. కానీ రోజు పొద్దుట లేవగానే కాస్త సమయం వ్యాయామానికి, యోగాకి కేటాయించినట్లయితే.. అనేక అనారోగ్య సమస్యలు మాయమవుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె కండరాలను బలోపేతం చేయడానికి అనేక వ్యాయామాలు ఉన్నాయి. వ్యాయామం చేయని వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి, మీ వయస్సును పరిగణనలోకి తీసుకుని, మీరు కొంత సమయం వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.

నోట్: పైన ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. గుండెకు, ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి చిన్న సమస్య వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అంతే కాకుండా వారు సజిస్ చేసిన వ్యాయామాలు క్రమం తప్పకుంటా చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగవుతోంది.



Source link

Related posts

పెరుగుతున్న మానవ మెదుడు పరిమాణం.. లాభమా?.. నష్టమా?

Oknews

చంద్రుని కక్ష్యలోకి మొదటి ప్రైవేట్ మూన్ ల్యాండర్.. ఫిబ్రవరి 22న ల్యాండింగ్ డేట్ ఫిక్స్..

Oknews

సూర్యగ్రహణం ఎఫెక్ట్.. ప్రజలకు NASA హెచ్చరిక..

Oknews

Leave a Comment