గత కొంతకాలంగా ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాకి తమిళ హీరో విష్ణుతో ఎఫైర్ నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి క్లోజ్‌గా తీసుకున్న సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. విష్ణు కొంతకాలం క్రితం తన భార్యతో విడిపోవడంతో ఇప్పుడు గుత్తాజ్వాలాని పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై హీరో విష్ణు స్పందించాడు.
తనకు జ్వాలా అంటే ఇష్టమని, ఆమెకి కూడా నేనంటే ఇష్టమని అని చెప్పుకొచ్చాడు. దాదాపు ఏడాదిన్నరగా ఒకరికి ఒకరు తెలుసని, కామన్ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తుంటామని చెప్పాడు. ప్రస్తుతం తమ మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని, ఈ స్నేహం నెక్ట్స్ స్టేజ్‌కి వెళ్తుందా అనే ప్రశ్నకు తనవద్ద సమాధానం లేదని, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని చెప్పారు. ఇటీవల ‘రాక్షసన్’ చిత్రంతో సక్సెస్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం ‘జగజ్జాల కిలాడి’ అనే సినిమాలో నటిస్తున్నాడు.