మెగాపవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)నయా మూవీ గేమ్ చేంజర్(game changer)కియారా అద్వానీ(kiara advani)హీరోయిన్. ఇప్పుడు ఈ హీరోయిన్ పై ఇండియన్ కుబేరుడు ముకేశ్ అంబానీ వన్ అండ్ ఓన్లీ డాటర్ ఈశా అంబానీ(isha ambani) కొన్ని వ్యాఖ్యలు చేసింది. అసలు కియారా కి ఈశా కి సంబంధం ఏంటి! ఇంతకీ ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం.
కియారా నాకు మంచి స్నేహితురాలు. ఇద్దరం కలిసి ముంబైలోని ధీరూభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కలిసి చదువుకున్నాం. కియారా చదువుతో పాటు ఆటల్లోను ఎప్పుడు నంబర్ వన్ గా ఉండేది.నన్ను కూడా ఆ రెండు రంగాల్లో ప్రోత్సహించేది.అదే విధంగా తనకి నచ్చని పని ఏదైనా చేస్తే వెంటనే చెప్పేస్తుంది.పైగా తను స్కూల్ కి రాని రోజు జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా అనిపించేది. స్కూల్లో జరిగే అన్ని ఈవెంట్స్ లో క్రమం తప్పకుండా పార్టిసిపేట్ చేస్తుంది. పైగా తనని నేనే రెడీ చేస్తానని కూడా చెప్పుకొచ్చింది.
అంతే కాకుండా ఆ చిన్ననాటి స్నేహం ఇప్పటి వరకు కొనసాగుతుందని, తన పెళ్లి టైం లో కూడా నేనే రెడీ చేసానని, తనకి షూటింగ్ లేకపోతే ఇద్దరం కలిసి చాలా విషయాలు ముచ్చటించుకుంటాం అని కూడా తెలిపింది. ఇప్పుడు ఈశా మాటలు వైరల్ గా మారాయి.పైగా అంబానీ కూతురు కావడంతో గేమ్ చేంజర్ కి మంచి పబ్లిసిటీ కూడా వచ్చినట్టయ్యింది. ఇక చరణ్, కియారాలు గతంలో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ లో కలిసి చేసారు. మూవీ ప్లాప్ గా నిలిచినా కూడా ఇద్దరి ఫెయిర్ కి మాత్రం మంచి పేరే వచ్చింది. అందుకే అప్పుడు గేమ్ చేంజర్ లో కలిసి చేస్తున్నారు. శంకర్(shankar)దర్శకుడు కాగా దిల్ రాజు నిర్మాత. క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతుందని దిల్ రాజు కొన్ని రోజుల క్రితం ప్రకటించాడు.