Entertainment

గేమ్ చేంజర్ టీజర్ డేట్ ఫిక్స్.. మెగా అభిమానులు బి రెడీ !


హమ్మయ్య ఎట్టకేలకు మెగాపవర్ స్టార్  రామ్ చరణ్ అభిమానుల ముఖాల్లో ఆనందం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే  వాళ్లంతా ఎప్పటినుంచో  ఎదురుచూస్తున్న రోజు అతిత్వరలోనే  రాబోతుంది. మిగతా హీరోలంతా తమ సినిమా అప్ డేట్స్  విషయంలో చాలా ఫాస్ట్ గా ఉంటే మా చరణ్ మాత్రం స్లో గా ఉన్నాడేంటి అని ఇక ఫ్యాన్స్ అనుకునే అవకాశం లేదు.  

ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ కోసం మెగా ఫాన్స్ లీగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ టీజర్  రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా  మార్చ్ 27 న  రిలీజ్ కాబోతుందనే  టాక్  ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది. అలాగే అదే రోజున రిలీజ్ డేట్ పై కూడా   క్లారిటీ వస్తుంది. దీంతో మెగా ఫ్యాన్స్ వర్రీ మొత్తం తీరిపోనుంది.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు  నిర్మిస్తుండగా  చరణ్ కి  కియార అద్వానీ  జోడీకడుతుంది. అంజలి, ఎస్. జే. సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్ర ఖని, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో మూవీ రూపొందుతుందని చరణ్ డ్యూయల్ రోల్ ని చేస్తున్నాడనే  ప్రచారం కూడా ఎప్పటినుంచో వినిపిస్తుంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

 



Source link

Related posts

ఆ సినిమాను థియేటర్‌లో చూసి ఆడియన్స్‌ షాక్‌ అవుతారంటున్న ఉపేంద్ర!

Oknews

mahanatudu is the name for chandrababu real life movie

Oknews

పూరి జగన్నాధ్ కొడుకు పేరు ఇక నుంచి  ఆకాష్ పూరి కాదు 

Oknews

Leave a Comment