GossipsLatest News

గేమ్ ఛేంజర్: రామ్ చరణ్ ఎంట్రీపై క్రేజీ బజ్


టాప్ డైరెక్టర్ శంకర్-గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ పై ట్రేడ్ లో బోలెడంత క్రేజ్ ఉంది. గత రెండున్నరేళ్లుగా షూటింగ్ చిత్రీకరణలోనే ఉన్న గేమ్ ఛేంజర్ ఫస్ట్ లో టైటిల్ వదిలి అప్పుడే ఏడాది పూర్తవుతుంది. ఆ చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎదురు చూడని క్షణం లేదు. మళ్ళీ రామ్ చరణ్ బర్త్ డే వరకు ఎలాంటి అప్ డేట్ ఉండకపోవచ్చని అంటున్నారు. అదలా అంటే.. గేమ్స్ చేంజ్ర్లో రామ్ చరణ్ ఎంట్రీపై క్రేజీ బజ్ వినిపిస్తోంది.

రామ్ చరణ్ కోసం దర్శకుడు శంకర్ తన మార్క్ లో ఒక డైనమిక్ ఎంట్రీ ని డిజైన్ చేసారని చిత్ర బృందం చెబుతోంది. ఈ సన్నివేశం రామ్ చరణ్ కెరీర్ లో మరో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రీ సీన్ గా నిలుస్తుంది అని అంటున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి మరో కీలక పాత్రలో కనిపించబోతుంది. మరి గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై మేకర్స్ మెగా ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ లో రిలీజ్ అంటున్నారు. అది ఎంతవరకు నిజమో అనేది చూడాలి.



Source link

Related posts

Gaami first weekend collections విశ్వక్ సేన్ గామి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Oknews

Aadhar updation at free of cost last date is extended to 14 June 2024 address change in aadhaar card

Oknews

Samantha-Chaitanya on the same stage after separation విడిపోయాక ఒకే స్టేజ్ పై సమంత-చైతన్య

Oknews

Leave a Comment