Top Stories

గోపీచంద్ ఉపాధి హామీ పథకం


టాలీవుడ్ డైరక్టర్లకు సువర్ణావకాశం. మీకు భారీ ఫ్లాప్ వచ్చిందా? ఏ హీరో మీకు కాల్షీట్లు ఇవ్వడం లేదా? పెద్ద హీరోలు మీ కథలు కూడా వినడానికి ఆసక్తి చూపించడం లేదా? అయితే ఇది మీ కోసమే. మీలాంటి వాళ్ల కోసం ఇండస్ట్రీలో ఓ హీరో సిద్ధంగా ఉన్నాడు. మీ దగ్గర కథ ఉంటే చాలు, కాల్షీట్ ఇవ్వడానికి రెడీ అంటున్నాడు. అతడే గోపీచంద్.

అవును.. ఈ హీరో ఇప్పుడు ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టినట్టు కనిపిస్తోంది. వరుసపెట్టి ఫ్లాప్ డైరక్టర్లకు అవకాశాలిస్తున్నాడు ఈ ఆరడుగుల ఆజానుబాహుడు. ఇప్పటికే శ్రీనువైట్లకు ఛాన్స్ ఇచ్చాడు. వీళ్లిద్దరి కాంబోలో సినిమా మొదలైంది. శ్రీనువైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పడానికేం లేదు. అతడు హిట్టిచ్చి ఏళ్లు దాటింది. అవకాశం అందుకోవడం కూడా కష్టంగా మారిన టైమ్ లో, గోపీచంద్ ఓకే చెప్పాడు.

శ్రీనువైట్ల తర్వాత మరో ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చేలా ఉన్నాడు గోపీచంద్. అతడి పేరు రాధాకృష్ణ. రాధేశ్యామ్ సినిమాతో ప్రభాస్ కు పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు ఈ దర్శకుడు. ఇతడితో గోపీచంద్ సినిమాకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో గోపీచంద్-రాధాకృష్ణ కలిసి జిల్ అనే సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి యూవీ క్రియేషన్స్ నేతృత్వంలోనే కలవబోతున్నారని టాక్.

వీళ్లిద్దరు మాత్రమే కాదు, ఆల్రెడీ గోపీచంద్ అవకాశం ఇచ్చిన ఇద్దరు దర్శకులు కూడా ఇదే టైపు. ఉదాహరణకు మారుతినే తీసుకుందాం. మంచి రోజులొచ్చాయి అనే సినిమా తర్వాత ఈ దర్శకుడికి గోపీచంద్ అవకాశం ఇచ్చాడు. తనకిచ్చిన అవకాశాన్ని మారుతి నిలబెట్టుకోలేకపోయాడు. పక్కా కమర్షియల్ అంటూ పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు.

శ్రీవాస్ పరిస్థితి కూడా ఇంతే. సాక్ష్యం అనే సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ వచ్చేసింది. అలాంటి టైమ్ లో గోపీచంద్ ఇతడికి అవకాశం ఇచ్చాడు. అయితే మారుతి టైపులోనే శ్రీవాస్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. రామబాణం రూపంలో డిజాస్టర్ ఇచ్చాడు.

ఇలా ఏరికోరి కొంతమంది డైరక్టర్లకు ఉపాధి కల్పిస్తున్నాడు గోపీచంద్. శ్రీనువైట్ల, రాధాకృష్ణ.. ఈ హీరోకు ఎలాంటి ఫలితాలు అందిస్తారో చూడాలి.



Source link

Related posts

వైసీపీ వీడేందుకేనా పార్థ‌సార‌థితో ఆ ఇద్ద‌రు భేటీ!

Oknews

ఎందుక‌య్యా… బ‌డాయి మాటలు!

Oknews

గంటాను టెన్షన్ పెడుతున్న హై కమాండ్…!?

Oknews

Leave a Comment