మొన్న శివరాత్రికి గోపీచంద్ భీమాతో అలరించాడు.డ్యూయల్ రోల్ లో అధ్బుతంగా నటించి మూవీని నిలబెట్టాడు. దీంతో ఆయన నటించబోయే నెక్స్ట్ మూవీ మీద అందరిలోను ఆసక్తి నెలకొని ఉంది. ఈ క్రమంలో వస్తున్న ఒక న్యూస్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
గోపీ చంద్ తన నయా మూవీని శ్రీను వైట్ల దర్శకత్వంలో చేస్తున్న విషయం అందరకి తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్ కూడా ప్రారంభయ్యింది. విదేశాల్లో కొంత భాగం చిత్రీకరణని కూడా జరుపుకుంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై వేణు దోనేపూడి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు లోకి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా జాయిన్ అయ్యింది.ఈ విషయాన్ని స్వయంగా వేణు నే వెల్లడించాడు. అంటే చిత్రాలయ సంస్థ, పీపుల్స్ మీడియా కలిపి గోపీచంద్ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.
ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక బడా నిర్మాణ సంస్థ అనే పేరు ఉంది. ఎన్నో భారీ చిత్రాలని నిర్మిస్తు ముందుకు దూసుకుపోతుంది. ఇది ఒకరకంగా గోపీచంద్ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు .తాజాగా కొత్త షెడ్యూల్ కూడా ప్రారంభం అయ్యింది. ప్రముఖ రచయిత గోపి మోహన్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత గోపి మోహన్ శ్రీను వైట్ల కాంబో రిపీట్ అవుతుంది. వెంకీ, రెడీ, దుబాయ్ శీను, దూకుడు లాంటి హిట్ చిత్రాలు ఆ ఇద్దరి కాంబోలో వచ్చాయి.