మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ యాక్షన్ డ్రామాతో తనదైన మాస్ అవతార్‌లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటానికి తారక్ సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.
దేవర ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ కొత్త షెడ్యూల్ గోవాలో ప్రారంభమైంది. ఇప్పటికే అక్కడ సినిమా చిత్రీకరణను చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వస్తోన్న అప్‌డేట్స్‌తో రోజు రోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్ డేట్ వచ్చింది.
దేవర మేకర్స్ సినిమా నుంచి వర్కింగ్ స్టిల్ విడుదల చేశారు. ఇందులో దర్శకుడు కొరటాల శివ, రాజు సుందరం మాస్టర్ తో పాటు ఉన్న ఎన్టీఆర్ సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీలో ఈ చిత్రానికి సంబంధించిన మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. ఎన్టీఆర్‌ను సరికొత్త పాత్రలో చూడటానికి ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవల ‘దేవర’ పార్ట్ 1 గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేయగా ఇండియా రేంజ్‌లో అది ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమాలోనే ఎక్కువమంది చూసిన గ్లింప్స్‌గా అది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంకా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాక్కో, నరైన్ తదితరులు నటిస్తున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీత సారథ్యం వహిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.