Health Care

గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన IAS ఆఫీసర్ భార్య.. అంతలోనే ఘోరం!


దిశ, ఫీచర్స్ : ఆమె ఓ ఐఏఎస్ ఆఫీసర్ భార్య.. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. కానీ ఆమె వాటిని నిలబెట్టుకోలేకపోయింది. అందరికీ ఆదర్శంగా నిలువాల్సింది పోయి తనే తప్పుడు మార్గంలో నడిచింది. ఓ గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమాయణం నడిపింది. అంతేకాకుండా అతనితో కలిసి చీకటి సామ్రాజ్యాన్ని ఏలాలనుకుంది. అసాంఘిక కార్యకాపాలకు పాల్పడింది. ఈ విషయం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా.. సదరు గ్యాంగ్‌స్టర్‌తో కలిసి పారిపోయింది. అప్పటికే భార్య ప్రవర్తన నచ్చని ఆ ఐఏఎస్ ఆఫీసర్ డివోర్స్ ఇచ్చేందుకు రెడీ అవ్వగా అంతలోనే ప్రియుడితో వెళ్లిపోయింది. ఆ తర్వాత ఘోరం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లో ఈ సంఘటన చోటుచేసుకోగా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

గుజరాత్‌ రాష్ట్రంలో గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్‌లో అదో ముఖ్యమైన శాఖ. అదే స్టేట్‌కు చెందిన ఐఏఎస్ కేడర్‌కు చెందిన వ్యక్తి అందులో రెగ్యులేటరీ కమిషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. కాగా అతని భార్యకు కొంతకాలం కిందట తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ గ్యాంగ్‌స్టర్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వారి మధ్య ప్రేమకు, క్రమంగా వివాహేతర బందానికి దారితీసింది. ఇంకేముంది 9 నెలల కిందట భర్తను వదిలేసి అతనితో కలిసి వెళ్లిపోయింది. ఇద్దరూ కలిసి చీకటి సామ్రాజ్యాన్ని ఏలడం మొదలు పెట్టారు. జులై 11న తమిళనాడు రాష్ట్రంలో ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించగా.. ఎవరో సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంబడించారు. దీంతో ఆ బాలున్ని వదిలేసి ఇద్దరూ పారిపోయారు.

ఇక అప్పటి నుంచి ఆ గ్యాంగ్‌స్టర్, అతని ప్రియురాలు అయిన ఐఏఎస్ ఆఫీసర్ భార్య కోసం వెతకడం మొదలు పెట్టారు పోలీసులు. తనకు ముప్పు తప్పేలా లేదని గ్రహించిన ఆమె తిరిగి గుజరాత్‌‌‌ గాంధీనగర్‌లో గల ఐఏఎస్ ఆఫీసర్ అయిన తన భర్త ఇంటికి తిరిగి వచ్చింది. కానీ అతను ఆమెను ఇంటిలోకి అనుమతించలేదు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆమె విషం తాగి అంబులెన్స్‌కు కాల్ చేసింది. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. సంచలనం సృష్టించిన ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. ఐఏఎస్ ఆఫీసర్ అయిన భర్త ఉండగా.. గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన ఆమెను తప్పుబడుతున్నారు నెటిజన్లు.



Source link

Related posts

Drinking warm water : ఉదయాన్నే గోరు వెచ్చటి నీరు తాగడం వలన ఎన్ని లాభాలో తెలుసా?

Oknews

రక్తం చిందిస్తున్న చెట్టు.. అది చూసి చలించిపోయిన జనం – వైరల్ వీడియో

Oknews

అల్యూమినియం కవర్స్‌లో ఉంచిన ఆహారాన్ని తింటున్నారా.. డేంజర్‌లో పడ్డట్టే!

Oknews

Leave a Comment