EntertainmentLatest News

గ్యాంగ్ స్టర్ ప్రేమలో మాళవిక మోహనన్  


మాళవిక మోహనన్(malavika mohanan)ఇప్పుడు ఈ పేరు ఇండియా మొత్తం మారుమోగిపోతుంది.ఇందుకు కారణం రాజా సాబ్(raja saab) ప్రభాస్(prabhas)హీరోగా వస్తున్న రాజా సాబ్ లో మాళవిక వన్ అఫ్ ది హీరోయిన్. దీంతో  ఇప్పుడు చాలా మంది  మాళవిక గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  ఆమె గురించి వస్తున్న ఒక వార్త  ఆకర్షిణీయంగా మారింది.

కేరళకి చెందిన  మాళవిక 2013 లో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన పట్టం పోలె అనే  మలయాళ  చిత్రంతో తెరంగ్రేటం చేసింది. నిర్ణయకం, నాను మట్టు వరలక్ష్మి, బియాండ్ ది క్లౌడ్స్, ది గ్రేట్ ఫాదర్ ,పేట,మాస్టర్, మారన్, క్రిస్టి,  లాంటి పలు భాషల సినిమాల్లో మెరిసింది. రేపు అగస్ట్ 15 న రిలీజ్ అవుతున్న విక్రమ్ తంగలాన్ లో కూడా  ఒక పవర్ ఫుల్ పాత్రలో చేస్తుంది.  ఇక మాళవిక సోషల్ మీడియాలో చాలా చురుగ్గా పాల్గొంటుంది. ఫాలోవర్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.దీంతో తరచుగా అభిమానులతో చిట్ చాట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక  అభిమాని మాళవిక తో మీకు ఎలాంటి సినిమా అంటే ఇష్టమని అడిగాడు. నాకు యాక్షన్ డ్రామాలంటే ఇష్టం. భవిష్యత్తులో ఒక గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించాలనుంది. ప్రతి నాయిక ఛాయలున్న క్యారెక్టర్స్ లో నటించడం అంటే నాకు ఆసక్తి ఎక్కువ అని చెప్పుకొచ్చింది.

తంగలాన్ (thangalan)లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రని చేసినా  కూడా  హీరోయిన్ గా  భారీ ఆఫర్స్ ని అందుకుంటుంది. అలాంటి టైం లో  ఇప్పుడు గ్యాంగ్ స్టార్ క్యారక్టర్ లో కనిపించాలని ఉందని చెప్పడంతో  ఆ క్యారక్టర్ ని ఎంత బాగా ప్రేమిస్తుందో అర్ధమవుతుంది. కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సర్ధార్ 2 లో కూడా హీరోయిన్ గా చేస్తుంది. ఇటీవలే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇవే కాకుండా మరిన్నిభారీ ప్రాజెక్టు లు ఆమె చేతిలో ఉన్నాయి. వాటి వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి.

 



Source link

Related posts

షర్మిలకు కీలక పదవి ఇవ్వనున్న కాంగ్రెస్..!

Oknews

పూరి జగన్నాధ్ కొడుకు పేరు ఇక నుంచి  ఆకాష్ పూరి కాదు 

Oknews

మహేష్‌, రాజమౌళి సినిమా విషయంలో అది నిజమేనంటున్న విజయేంద్రప్రసాద్‌!

Oknews

Leave a Comment