దిశ, ఫీచర్స్: హిందూ పంచాంగం ప్రకారం, ప్రత్యేక సంఘటనలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో చంద్రగ్రహణం కూడా.. ఈ రోజు ఒక వైపు హోలీ జరుపుకుంటున్నారు.. మరో వైపు చంద్రగ్రహణం ఏర్పడనుంది. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఈ యాదృచ్చికం జరుగుతుంది. గ్రహణాలు ఎల్లప్పుడూ చెడు ఫలితాలకు దారితీస్తుందని ప్రజలలో ఒక నమ్మకం ఉంది. అయితే, ఈసారి రానున్న గ్రహణం కొందరి జీవితాల్లో వెలుగులు నింపనుంది. ఈ అదృష్ట రాశులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
సింహ రాశి
ఈ గ్రహణం వల్ల సింహరాశి వారికి మంచిగా ఉంటుంది. మీ చింతలన్నీ తీరుతాయి.ఈ సమయంలో మీరు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా అది విజయవంతమవుతుంది. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటే లక్ష్మి దేవి అనుగ్రహిస్తుంది. మీరు కోరుకున్న పదవి మీ సొంతమవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది.
మేషరాశి
హోలీ రోజు ఏర్పడే ఈ చంద్రగ్రహణం మేషరాశి వారికి అపూర్వమైన ప్రయోజనాలను తెస్తుంది. మీరు పనిచేసే ఆఫీసులో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారులు ఊహించని లాభాలను పొందుతారు. భార్య, భర్తల మధ్య విభేదాలు తొలగిపోయి.. ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది.