EntertainmentLatest News

ఘనంగా యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం


యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య, తమిళ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యంగ్‌ హీరో ఉమాపతి రామయ్యను వివాహం చేసుకోబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థం శుక్రవారం జరిగింది. చెన్నైలో అర్జున్‌ నిర్మించిన హనుమాన్‌ టెంపుల్‌లో ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఇరు కుటుంబాలకు చెందిన బంధువుల సమక్షంలో నిర్వహించారు. ఐశ్వర్య, ఉమాపతిల వివాహం 2024 సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో ఉంటుందని అర్జున్‌ తెలిపారు. ఇరు కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు. పెళ్ళికి మాత్రం అందర్నీ ఆహ్వానిస్తామని అర్జున్‌ ఈ సందర్భంగా తెలిపారు. 

ఈ నిశ్చితార్థ వేడుకలో ఉమాపతి రామయ్య డ్రస్‌ని ముంబైకి చెందిన మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేయగా.. ఐశ్వర్య అర్జున్‌ ధరించిన డ్రస్‌ను జయంతి రెడ్డి డిజైన్‌ చేశారు. 5 క్యారెట్‌ బర్మీస్‌ రూబీ విత్‌ డైమండ్‌ అండ్‌ వైట్‌ గోల్డ్‌తో చేసిన రింగ్‌ని ఐశ్వర్య అర్జున్‌ ధరించగా.. ఉమాపతి కూడా గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ రూబీ ధరించారు. హనుమాన్‌ టెంపుల్‌లోని రాముల వారి విగ్రహం ముందు ఐశ్వర్య-ఉమాపతి నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారని అర్జున్‌ తెలియజేశారు. 



Source link

Related posts

కేటిఆర్ కి ఒక నమస్కారం.. సమంత పోస్ట్ వైరల్ 

Oknews

brs chief kcr nominates vaddiraju ravichandra as party rajyasabha candidate | BRS: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర

Oknews

Ilayaraja house is a tragedy ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం

Oknews

Leave a Comment