మంత్రి సవిత తన సెక్యూరిటీ, ఇతర సిబ్బంది సాయంతో ఆటోలో ఇరుక్కున్న క్షతగాత్రులను బయటకు తీయించారు. అనంతరం వారికి ధైర్యం చెబుతూ సిబ్బందితో అంబులెన్స్‌కు ఫోన్ చేయించి, వేగంగా అంబులెన్స్‌ను రప్పించారు. క్షతగాత్రులను సెక్కూరిటీ, ఇతర సిబ్బందితో అంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ప్రమాదంలో మరణించిన బాలుడి మృతదేహాన్ని కూడా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. అలాగే వైద్యులకు ఫోన్ చేసి క్షతగాత్రులకు చికిత్స వేగవంతం చేయాలని సూచించారు.