Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పార్టీ శ్రేణులు మోత మోగిద్దాం అనే వినూత్న కార్యక్రమం చేపట్టాయి. శనివారం రాత్రి 7 గంటల నుంచి రాత్రి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు టీడీపీ మద్దతుదారులు శబ్దాలు చేశారు. చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు మోత మోగించాలని ఆయన సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్, నారా బ్రాహ్మణి ప్రజల్ని విజ్ఞప్తి చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు భారీగా స్పందించాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి పళ్లాలు, డప్పులు, ఈలలు, హారన్ల శబ్దాల చేస్తూ మోత మోగించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ చంద్రబాబుకు సంఘీభావంగా ప్రజలు మోత మోగిద్దాం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారు తమ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దిల్లీలో నారా లోకేశ్, ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, ఎంపీలు రఘురామకృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడు గంట, ప్లేటు మోగిస్తూ చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. రాజమండ్రిలో నారా బ్రాహ్మణి, మాజీ మంత్రి చినరాజప్ప, పార్టీ శ్రేణులు శబ్దాలు చేస్తూ మోత మోగించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నక్కా ఆనందబాబు, టీడీపీ నేతలు మోతమోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని