Andhra Pradesh

చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ముగిసిన వాదనలు, తీర్పు రేపటికి వాయిదా-vijayawada chandrababu cid custody petition acb court verdict postponed to september 22nd ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Chandrababu Custody : టీడీపీ అధినేత చంద్రబాబును ఐదు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ… విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు ముగిశాయి. కస్టడీ పిటిషన్ పై ఏసీబీ తీర్పు వాయిదా వేసింది. రేపు(శుక్రవారం) ఉదయం గం.10:30లకు తీర్పు వెలువరించనున్నట్లు కోర్టు తెలిపింది. స్కిల్ స్కాంలో పక్కా ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశామని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చంద్రబాబును ఐదు రోజులు కస్టడీకి ఇస్తే మరిన్ని వాస్తవాలు తెలుస్తాయన్నారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉన్న దృష్ట్యా ఏసీబీ కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం చంద్రబాబు క్వాష్ పిటిషన్ లిస్ట్ అయితే తీర్పు వాయిదా వేస్తానని ఏసీపీ కోర్టు జడ్జి తెలిపారు. క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే శుక్రవారం తీర్పు వెలువరిస్తానన్నారు.



Source link

Related posts

AP TET 2024 Edit Option: ఏపీ టెట్ 2024 దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ రెడీ.. తప్పులు సరి చేసుకోండి ఇలా..

Oknews

Talliki Vandanam Updates: తల్లికి వందనంలో లబ్ది పొందాలంటే విద్యార్ధులకు ఆధార్‌ ధృవీకరణ తప్పనిసరి

Oknews

ఒకే జిల్లాలో టీడీపీకి ముగ్గురు రెబెల్స్?!

Oknews

Leave a Comment