రాజకీయ కక్షసాధింపులకు అవకాశం
అంతకు ముందు హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ… స్కిల్ డెవలప్మెంట్ కేసుకు 17ఏ వర్తిస్తుందని వాదించారు. రిమాండ్ సమయంలో ఈ కేసులో చంద్రబాబును పేరును చేర్చానని తెలిపారు. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారన్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు అని వాదించారు. రిమాండ్ రిపోర్టు, కౌంటర్ అఫిడవిట్లు మొత్తం ఆరోపణలే ఉన్నాయన్నారు. ప్రతిపక్ష నేతను విచారించడం తమ హక్కు అన్నట్లు ఏపీ ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుందని సాల్వే వాదించారు. రాజకీయ కక్షసాధింపులను నిరోధించేందుకు 17ఏ సెక్షన్ ఉందన్నారు. ఈ సెక్షన్ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుందన్నారు. 1964 నాటి రతన్ లాల్ కేసును హరీశ్ సాల్వే ప్రస్తావించారు. 17ఏ వర్తిస్తుందా? లేదా? అన్న దానిపై విచారణ జరుగుతోందని మధ్యంతర బెయిల్ ఈ పిటిషన్ లో ప్రస్తావన లేదని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం అభిప్రాయపడింది.