Top Stories

చంద్రబాబు చేతగానితనం చాటి చెప్పిన సతీమణి!


మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్ధత ఏ పాటిది? ఆయన నిజంగానే అద్భుతాలు సృష్టించేంతటి గొప్ప ముఖ్యమంత్రిగా సేవలందించారా? అవన్నీ ఆయన తెలివితేటలేనా.. లేకపోతే ఆయన ఘనమైన నాయకుడు అనే భ్రమను చాలా సమర్థంగా ప్రజల బుర్రలోకి ఎక్కించారా అనే సందేహాలు ఇప్పుడు ప్రజలకు కలుగుతున్నాయి.  

ఎందుకంటే చంద్రబాబు నాయుడు  చేతగానితనం గురించి ఇన్ డైరెక్ట్ గా ఆయన సతీమణి భువనేశ్వరి వెల్లడించడం విశేషం. తమ సొంత డబ్బా కొట్టుకోవడంలో భాగంగా, భువనేశ్వరి నోరు జారారో లేదా తన మాటలకు ఎలాంటి అర్థం వస్తుందో తెలియక బయటకు అనేశారో గానీ, అసలు సీక్రెట్ వెల్లడించారు.

చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం దారుణమని, ఏ తప్పు చేయకుండానే ఆయనను 17 రోజులుగా జైలులో నిర్బంధించాలని భువనేశ్వరి ఆరోపించారు. ప్రజల కోసమే ఆయన జైలుకు వెళ్లినట్లుగా ఆమె సర్టిఫికెట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అవినీతి చేసి నిధులు స్వాహా చేశారని ఆరోపణలు వినిపిస్తుండగా.. తమకు డబ్బు అవసరం లేనంత సంపద తమకు ఉన్నదని భువనేశ్వరి చెప్పడం విశేషం. తాను నడుపుతున్న కంపెనీలో రెండు శాతం షేర్లు అమ్ముకున్నా కూడా తమకు 400 కోట్లు వస్తాయని ఆమె వెల్లడించడం తమాషా.

ఇలాంటి మాటలు చెప్పడంలో భాగంగా నారా భువనేశ్వరి తమ ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి కూడా సొంత డప్పు కొట్టుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం అని భువనేశ్వరి చెప్పుకున్నారు. ట్రస్టు ద్వారా రెండు వేల మంది అనాధ, పేద పిల్లలను చదివిస్తున్నట్లుగా చెప్పారు. ప్రభుత్వాలు కంటే కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుండి సేవలు అందిస్తుందని తాను చాలా గర్వంగా చెప్పగలను అంటూ భువనేశ్వరి సెలవిచ్చారు. సరిగ్గా ఈ మాట దగ్గరే ప్రజలలో సందేహం తలెత్తుతోంది.  

ఏ చంద్రబాబు నాయుడు గురించి అయితే.. ప్రజల కోసమే జైలుకు వెళ్లినట్లుగా భువనేశ్వరి కితాబు ఇస్తున్నారో.. అదే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈ రాష్ట్రానికి అతి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత, రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. వారి కుటుంబం నడిపే ఎన్టీఆర్ ట్రస్టుకు మించి ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసే పరిస్థితిని ఆయన ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు చేతకానితనం కిందికి వస్తుందా రాదా అని ప్రజలు తర్కించుకుంటున్నారు.  

ఎదుటివారి వైపు ఒక వేలు చూపిస్తే, నాలుగు వేళ్లు తమ వైపే చూపిస్తాయని పెద్దలంటారు. భువనేశ్వరి సొంత డప్పు కొట్టుకుంటున్న వైనం గమనిస్తే.. ఆమె ఆత్రుతలో, చంద్రబాబు నాయుడు పరువే మంటగలుస్తున్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.



Source link

Related posts

బీజేపీ జాబితాలో జ‌న‌సేన‌కు చోటు వుంటుందా?

Oknews

వైసీపీని పొగుడుతున్న జేడీ..!

Oknews

జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల‌కే పెద్ద‌పీట‌

Oknews

Leave a Comment