GossipsLatest News

చంద్రబాబూ.. ఎందుకీ సెల్ఫ్‌గోల్స్!


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండోసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాల్సిందేనని వైసీపీ.. వైఎస్ జగన్ సీఎం పీఠం ఎలా ఎక్కుతారో మేమూ చూస్తామని కూటమి.. గట్టిగానే యుద్ధం నడుస్తోంది. ఈ ఎన్నికల పోరులో ఎవరు గెలుస్తారన్నది మరికొన్నిరోజుల్లో తేలిపోనుంది. కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఎందుకో చేజేతులారా చేసుకుంటున్నారేమో అనే అనుమానాలు సొంత పార్టీ నేతలు, శ్రేణుల్లో వస్తున్నాయి. ప్రభుత్వం  తీరు, జగన్ పాలనపై విమర్శలు చేయొచ్చు.. తప్పులు ఎత్తి చూపి.. అధికారంలోకి వచ్చాక ఇదిగో ఫలానా చేస్తామని చెప్పొచ్చు అందులో ఎలాంటి తప్పులేదు కానీ.. ఇవన్నీ పక్కనెట్టి చంద్రబాబు ఎందుకో ఈ మధ్య అన్నీ సెల్ఫ్‌గోల్స్ వేసుకుంటున్నట్లు ఆయన మాటలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

విలన్ అవుతున్నారా..?

చంద్రబాబు ప్రజాగళం మొదలుకుని ఇప్పటి ఎన్నికల ప్రచారం వరకూ.. ఆయన ప్రసంగాన్ని కాస్త నిశితంగా పరిశీలిస్తే ఎప్పుడు చూసినా.. ఎక్కడ చూసినా మద్యం.. మద్యం అనే వినిపిస్తున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామని.. పదే పదే చెబుతున్నారు. బాబు ఈ మాట చెప్పిన కాసేపు కాస్త జోష్‌గానే ఉంటుంది.. యూత్ కూడా ఈలలు, కేకలు వేస్తారు సరే.. ఆ తర్వాత పరిస్థితేంటి..? అన్నది మాత్రం ఎందుకో ఊహించట్లేదు. చూశారుగా.. మందు బాబులను ఆకట్టు పనిలో మహిళల పాలిట బాబు ఎలా విలన్ అవుతున్నారో అర్థమవుతోంది కదా. ఇదే విషయాన్ని ఎలా చెప్పొచ్చు.. మద్యపాన నిషేధం చేస్తానని వైఎస్ జగన్ చెప్పి ఈ పరిస్థితికి తెచ్చారు.. తాను అధికారంలోకి వస్తే మొదట చేసే పని ఇదే అని ధైర్యంగా, ధీమా చెప్పొచ్చు.. హామీ ఇవ్వొచ్చు.. అవసరమైతే మేనిఫెస్టోలో కూడా పెడతానని చెప్పొచ్చు కూడా. కానీ బాబు నోట మాత్రం ఈ మాట అస్సలు రావట్లేదు. వాస్తవానికి ఈ మాట చెబితే చంద్రబాబుకు ఎంత ప్లస్ అవుతుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

ఇదేందయ్యా ఇదీ..!

నాణ్యమైన విద్య, తక్కువ ధరలకే నిత్యావసరాలు, పెట్రోలు-డీజిల్ రేట్లు తగ్గిస్తాం ఇంకా ఇలా చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయ్ కదా.. ఒక్క మద్యాన్నే తక్కువ ధరకే, నాణ్యమైన మద్యం అని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉందో కదా. నిజానికి ఎన్నికలు వస్తే ఏ పార్టీ అధినేత అయినా ఏం చెబుతారు..? చంద్రబాబు ఏం చెబుతున్నారు..? అంటూ టీడీపీ శ్రేణులే నివ్వెరపోతున్న  పరిస్థితి. పోనీ ఒక్క సభలో అయితే ఏమైనా అనుకోవచ్చు కానీ.. ఎక్కడ సభ జరిగినా ఆటోమాటిక్‌గా మద్యం మాట వచ్చేస్తోంది. లేని పోని బ్రాండ్స్ తెచ్చి, రేట్లు ఇష్టానుసారం పెంచేసి మద్యం ప్రియుల కోపానికి జగన్ కారణమవుతున్నారు. బహుశా దీన్ని క్యాష్ చేసుకోవడానికి చంద్రబాబు ఇలా అన్నారేమో కానీ.. ఇక్కడే చంద్రబాబు సెల్ఫ్‌గోల్ వేసుకున్నారు. ఈ మాటలతో మందు బాబులకు హీరో అవ్వొచ్చు గాక.. మహిళలకు మాత్రం విలన్ అయిపోతున్నారు కదా.!. ఒకసారి బాబు చుట్టుపక్కల ఉన్నోళ్లు కాసింత చెబితే బాగుంటుందేమో. 

ఎందుకీ తప్పులు!

అంతేకాదు.. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ జరగొద్దని ఈసీకి ఫిర్యాదు చేయడం.. సరిగ్గా ఒకటో తారీఖు ముందు ఇలా చేయడంతో పెన్షనర్ల మదిలో ఏముంటుంది..? ఎవరేమనుకున్నా ఇదంతా చంద్రబాబు అండ్ కో చేస్తున్నారనే మాట కచ్చితంగా వస్తుంది కదా..? దీంతో పెన్షనర్లు అంతా ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం అవుతారే తప్ప ఎందుకు కూటమి అదేనండోయ్.. టీడీపీకి ఎలా సపోర్టు చేస్తారనేది చంద్రబాబుకు ఎందుకు తెలియట్లేదు. ఎన్నికల కోడ్ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘమే ఇలా చేసిందని చెప్పుకోవచ్చేమో కానీ.. జనాలకు అవన్నీ తెలుస్తాయా..? పోనీ ఇవన్నీ పెన్షనర్లకు తెలియజేసే పరిస్థితి ఏమైనా ఉందా అంటే అబ్బే అదేమీ లేదు. దీనికి తోడు.. పెన్షన్లు పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాయడం గమనార్హం. ఎన్నికల ముందు ఏం చేయాలన్నా ఆచితూచి అడుగులు వేయాలే తప్ప.. ఇలా సెల్ఫ్ గోల్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తే మంచిదేమో అని చంద్రబాబుకు.. రాజకీయ విశ్లేషకులు, సొంత పార్టీలోని కొందరు తెలుగు తమ్ముళ్లు సూచిస్తున్న పరిస్థితి. ఇకనైనా మార్పు వస్తుందో రాదో చూడాలి మరి.



Source link

Related posts

రజినీకాంత్‌పై సీరియస్‌ అయిన మహిళ.. వీడియో వైరల్‌!

Oknews

Chiranjeevi risky action without dupe డూప్ లేకుండా చిరంజీవి రిస్కీ యాక్షన్

Oknews

గామి కి మెగాస్టార్ విశ్వంభర హెల్ప్ ఉంది..అడ్వాన్స్ బుకింగ్ లో రికార్డు  

Oknews

Leave a Comment