Health Care

చక్కెరకు బదులు వీటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు..


దిశ,ఫీచర్స్: షుగర్ ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చక్కెరను అధికంగా తీసుకోవడం వలన మధుమేహానికి దారితీస్తుంది. అంతే కాకుండా, శరీరంలో కేలరీల సంఖ్య మరింత పెరుగుతుంది. అందుకే చక్కెరకు బదులు ఇతర పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్న వారు పంచదారకు బదులు ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

స్టెవియా ప్లాంట్: చక్కెరకు బదులుగా స్టెవియా ఆకులను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది. అవి చేదును కలిగిస్తాయి.

తేనె: స్వచ్ఛమైన తేనెలో ఎన్నో పోషకాలు ఉంటాయి అలాగే ఇది ఆరోగ్యానికి మంచిది. చక్కెరకు బదులు దీన్ని తీసుకుంటే ఆరోగ్యకరం.

బెర్రీలు: మీరు చక్కెరకు బదులుగా బెర్రీలను కూడా తీసుకోవచ్చు. అల్పాహారం, డెజర్ట్‌లు మొదలైన వాటికి చక్కెరకు బదులుగా కాలానుగుణ బెర్రీలను ఉపయోగించడం. మంచి ఫలితాలను ఇస్తుంది.

అరటిపండ్లు : అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చక్కెరతో పోలిస్తే, ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

బెల్లం: బెల్లంలో ఐరన్‌, విటమిన్లు ఉంటాయి. పంచదారకు బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.

కొబ్బరి పంచదార: కొబ్బరి పంచదార తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే, దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.



Source link

Related posts

Immunity Boosters : రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్స్..

Oknews

ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఉందని తెలుసా..! ఎక్కడో కాదు మనదేశంలోనే..

Oknews

Insomnia: పిల్లల్లోనూ నిద్రలేమి.. ‘డిజిటల్ ఏజ్’ ఎఫెక్టే కారణమా?

Oknews

Leave a Comment