ByGanesh
Mon 19th Feb 2024 05:18 PM
దేవర చిత్రంతో సౌత్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ కపూర్ నక్క తోక తొక్కింది. నిన్నమొన్నటివరకు సౌత్ ఆఫర్స్ పట్టించుకోని జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ వెంట పడుతుంది. హిందీలో హీరోయిన్ గా టాప్ రేంజ్ కి చేరుకుందామని కలలు కనింది. కానీ జాన్వీ కపూర్ కి హిందీలో అడుగడుగునా నిరాశే ఎదురయ్యింది. అందుకే ఎన్టీఆర్ నుంచి దేవర ఛాన్స్ రాగానే పాప వెనక్కి తిరిగి ఆలోచించకుండా ఒప్పేసుకుంది. ప్రస్తుతం దేవర సెట్స్ లో జాన్వీ కపూర్ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఆమె తండ్రి బోని కపూర్ చెబుతున్నారు.
అంతేకాదండోయ్ జాన్వీ కపూర్ కి లక్కీ ఆఫర్స్ తలుపు తట్టాయి. అదే రామ్ చరణ్ తో జాన్వీ కపూర్ మూవీ ఓకె అయ్యింది. బుచ్చి బాబు తో చెయ్యబోయే రామ్ చరణ్ RC16 లో జాన్వీ కపూర్ హీరోయిన్ అనే ప్రచారాన్ని బోని కపూర్ నిజం చేసారు. రామ్ చరణ్ తో జాన్వీ కపూర్ నటిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ప్రస్తుతం తెలుగులో నటిస్తున్న జాన్వీ కపూర్ త్వరలోనే తమిళ స్టార్ హీరో సూర్య సరసన కూడా నటించబోతున్నట్టుగా బోని కపూర్ కన్ ఫర్మ్ చేసారు.
శ్రీదేవి పలు భాషల్లో సినిమాలు చేసింది. జాన్వీ కపూర్ కూడా చాలా భాషల్లో సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నట్టుగా బోని కపూర్ చెప్పారు. ఒక్కసారిగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాల్లో జాన్వీ కపూర్ అవకాశాలు దక్కించుకోవడంతో నిజంగా ఆమె లక్కుని అందరూ పొగిడేస్తున్నారు.
Boney Kapoor confirms Janhvi Kapoor has been roped in for Ram Charan next:
Boney Kapoor Confirms Janhvi Kapoor Will Work With Ram Charan, Suriya