Health Care

చర్మ సమస్యలు గుండె జబ్బులకు దారితీస్తాయా?.. ఈ లక్షణాలు ఉంటే..


దిశ, ఫీచర్స్ : కొన్ని ఆరోగ్య సమస్యలు అంతటికే పరిమితం కాకుండా ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంటాయి. చర్మ సమస్యల్లోనూ కొన్ని అలాంటి లక్షణాలను కలిగి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా కొన్నిసార్లు స్కిన్ నీలిరంగులోకి మారుతూ ఉంటుంది. మరి కొన్నిసార్లు ఎల్లో కలర్‌లో కనిపించవచ్చు. ఇంకొన్నిసార్లు ఎర్రటి మచ్చలు, దద్దుర్లు కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడూ వచ్చిపోతే వీటిని సాధారణం అనుకోవచ్చు. కానీ తరచూ కనిపిస్తుంటే మాత్రం మీ గుండె బలహీన పడి ఉండవచ్చునని నిపుణులు చెప్తు్న్నారు. ఎందుకంటే కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ గుండె జబ్బులతో ముడిపడి ఉంటాయని ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

సైనోసిస్

మీ స్కిన్ లేదా పెదవులు, గోర్లు నీలం రంగులో మారుతాయి. బ్లడ్‌లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే గుండె వైఫల్యానికి దారితీయవచ్చు. ఇది పుట్టుకతో వచ్చే గుండె లోపానికి వార్నింగ్ సిగ్నల్ కూడా కావచ్చు. కాబట్టి సైనోసిస్ బాధితుల్లో చర్మం రంగులు మారుతూ ఉంటే గనుక అవసరమైన టెస్టులు చేయించుకోవాలి. తగిన చికిత్స ద్వారా రాబోయే హార్ట్ ప్రాబ్లమ్స్‌ను నివారించవచ్చు.

క్లబ్బింగ్

కొందరికి చేతి వేళ్లపైన గోర్ల చుట్టూ చీము పట్టడం, నొప్పి కలగడం వంటి ఇబ్బందులు కనిపిస్తుంటాయి. దీనినే క్లబ్బింగ్ అంటారు. రక్తంలో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. ఈ పరిస్థితి పుట్టుకతో వచ్చే గుండె జబ్బులవల్ల తలెత్తవచ్చు లేదా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వారిలోనూ ఈ సింప్టమ్స్ కనిపిస్తాయి.

చర్మంలో కొవ్వు నిల్వలు

కొందరిలో శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. చర్మంపై కొవ్వు నిల్వలు (Xanthomas) పసుపురంగు గడ్డలుగా కనిపిస్తే గనుక అనుమానించాల్సిందే. హై కొలెస్ట్రాల్ ఉన్నవారిలో ఈ సమస్య తలెత్తుతుంది. అయితే తరచుగా ఈ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతుంటే గనుక గుండె జబ్బులకు దారితీస్తాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

పెటెచియా

సాధారణంగా చర్మం ఉపరితలం కింద రక్తస్రావం జరిగినప్పుడు కనిపించే చిన్నపాటి ఎరుపు లేదా ఊదా రంగు మచ్చలను పెటెచియాస్ అంటారు. ఇవి ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్‌కు సంకేతం కావచ్చు. గుండె కవాటాల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఏర్పడుతుంటాయి. నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులకు దారితీస్తాయి.

ఓస్లర్ నోడ్స్

ఓ స్లర్ నోడ్స్ అనేవి అరి కాళ్లు, చేతి వేళ్లపైన, అరిచేతుల్లో చిన్నపాటి గాయాల మాదిరి కనిపంచే ఎరుపు రంగు మచ్చలు. ఇవి ఏవైనా గాయాలు కలిగినప్పుడు, ముండ్లు గుచ్చుకున్నప్పుడు నిలిచిపోయిన గాయాల మాదిరి కనిపిస్తుంటాయి. గుండె జబ్బుల ప్రమాద హెచ్చరికగా పరిగణించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్పైడర్ వీన్స్

కొందరిలో చర్మంలోని నరాలు ఉబ్బినట్లు పైకి కనిపిస్తుంటాయి. ఈ పరిస్థితినే స్పైడర్ వీన్స్ లేదా సిరలు అంటారు. గుండె కవాటాల్లో లోపాలు లేదా కాలేయ వ్యాధితో ఇవి సంబంధం కలిగి ఉంటాయి. గుండె పనితీరును పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు జాగ్రత్త పడాలి. లేకపోతే గుండెపోటు ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు.



Source link

Related posts

వసంత పంచమి నాడు సరస్వతి తల్లిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసా..

Oknews

ప్రతిరోజూ చికెన్ తినడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

Oknews

గేట్ 2024 పరీక్షలు ప్రారంభం.. పరీక్ష మార్గదర్శకాలు ఇవే..

Oknews

Leave a Comment