దిశ, ఫీచర్స్ : మాంసాహారులు ఎక్కువగా చికెన్ ను తింటుంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇతర రకాల మాంసం కంటే సులభంగా జీర్ణమవుతుంది. దీనిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. చికెన్ వంటకాలు.. ప్రతి ఒక్కరూ ఒక్కోలా చేస్తారు. అయితే, కోడి మాంసం తినడం కంటే చికెన్ లివర్ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
కొందరికి చికెన్ ను చూస్తే నోరూరిపోతుంది.కొంతమంది చికెన్ లివర్ తినడానికి ఇష్టపడతారు. ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే చికెన్ లివర్‌లో విటమిన్ ఎ, బి, ప్రొటీన్లు, మినరల్స్, ఐరన్, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో చాలా సెలీనియం ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చికెన్ లివర్ తినడం వలన కంటి, చర్మం, రక్తహీనత సమస్యలను పరిష్కరిస్తుంది. చికెన్ లివర్‌లో ఐరన్, విటమిన్ బి12 పుష్కలంగా ఉన్నాయి. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. మీరు దీన్ని తింటే, మీ రక్త కణాలు పెరుగుతాయి. ఇది రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. చికెన్ లివర్‌లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. చికెన్ లివర్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.