దిశ, ఫీచర్స్: మనలో చాలా మంది చిగుళ్ల సమస్యతో బాధ పడుతుంటారు. నాన్ వెజ్ తినే సమయంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. దీని వలన అనేక ఇతర ఆరోగ్య సమస్యలను కూడా వస్తాయి.అయితే, సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీ దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా, మన ఆహారంలో కొన్ని రకాల ఫుడ్స్ యాడ్ చేసుకుంటే మన చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
పండ్లు, కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని మన డైట్ లో చేర్చుకోవడం వలన ఇవి చిగుళ్ళ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా, పాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి దంతాలను బలోపేతం చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. ఫ్యాటీ ఫిష్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చిగుళ్ల వ్యాధి రాకుండా కాపాడతాయి.
టీ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. దంత ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. రోజూ నీళ్లు తాగడం వల్ల మీ దంతాలు హైడ్రేట్‌గా ఉంటాయి. పంటిలో పేరుకుపోయిన బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
గమనిక: ఇఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.