దిశ, ఫీచర్స్: ఈ వ్యాధి అనేది ఒక రకమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్. ఇది బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సాధారణంగా కలుషిత నీటిలో స్నానం చేస్తే అది మన ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఆ తర్వాత మెదడుకు సోకుతుంది. అలా సోకి మనిషి ప్రాణం పోయేలా చేస్తుంది. అయితే ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ కారణంగా గత రెండు నెలల్లో మొత్తం మూడు మరణాలు సంభవించాయి. అందువల్ల, ఈ ప్రాణాంతక మెదడు సంక్రమించే అమీబా గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏమిటి.. దానిని మనం ఎలా నివారించవచ్చు.. అసలు దాని గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అసలు బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏమిటి:
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. నేగ్లేరియా ఫౌలెరి అనేది ఒక స్వేచ్ఛా జీవి అమీబా. దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. ఇది వెచ్చని మంచినీటిలో నివసిస్తుంది. ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి కేంద్ర నాడీ వ్యవస్థకు సోకి ఆ తర్వాత ప్రాణాంతకంగా మారుతుంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా మెదడు కణజాలాలను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా మెదడు పనిచేయడం ఆగిపోతుంది. దీంతో మనిషి ప్రాణాలు పోయే స్థితికి వస్తుంది.
అదేవిధంగా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం.. కొన్నిసార్లు ఈ అమీబా మురికి స్విమ్మింగ్ పూల్స్ మొదలైన వాటిలో కూడా ఉంటుందని తెలిపారు. ఈ వ్యాధి సోకిన రెండు నుంచి 15 రోజుల తర్వాత దీని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి.
అమీబా ఇన్ఫెక్షన్ లక్షణాలు ఏమిటి:
*తీవ్రమైన తలనొప్పి
*తీవ్ర జ్వరం
*వికారం
*వాంతి
*గట్టి మెడ
*చూడటంలో ఇబ్బంది
*గందరగోళం
*సమతుల్యం చేయలేకపోవడం
*కోమా
దీన్ని ఎలా నివారించాలి:
*నోస్ ప్లగ్స్ లేకుండా వెచ్చని మంచినీటి చెరువుల్లోకి దిగొద్దు. ఆ నీళ్లకు బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకే అవకాశం ఉంటే దూరంగా ఉండటం మంచిది.
*ఒకవేళ దిగిన తర్వాత.. ముక్కు శుభ్రం చేయడానికి నీటిని మరిగించి.. చల్లబరిచి ఆపై ఉపయోగించాలి. *క్లోరినేటెడ్ స్విమ్మింగ్ ఫూల్స్‌ను మాత్రమే ఉపయోగించాలి.
*ఈత కొట్టేటప్పుడు మీ నోటిని నీటి అడుగున ఉంచవద్దు.
*వేడి నీటి చెరువు లేదా స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లిన తర్వాత.. మీకు తలనొప్పి లేదా జ్వరం ఉంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
*ఇది ఎక్కువగా పిల్లలకు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి వారిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి.
నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.