EntertainmentLatest News

చిరంజీవికి నో చెప్పాను.. 90 లో నజీబ్ ఆల్రెడీ పుస్తకం రాసాడు 


మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)సినిమాలో ఆఫర్ అంటే మాటలా చెప్పండి. చిరుతో కలిసి నటిస్తే తమ కెరీర్ కి  స్పీడ్ వస్తుందని భావించి ఎంత బిజీగా ఉన్నా కూడా నటించడానికి ఓకే చెప్తారు. కానీ ఒక యాక్టర్ మాత్రం అందుకు విరుద్ధంగా చేసాడు.  స్వయంగా చిరునే  ఫోన్ చేసి అడిగినా కూడా నో చెప్పాడు.

పృథ్వీ రాజ్ సుకుమారన్ (Prithviraj sukumaran) మలయాళ సినిమా రంగంలో తిరుగులేని కథానాయకుడు. ఎన్నో అధ్బుతమైన సినిమాల్లో నటించి  కొన్ని లక్షల మంది అభిమానులని సంపాదించాడు. రీసెంట్ గా సలార్ లో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించి సినిమా విజయంలో భాగస్వామి అయ్యాడు. ప్రస్తుతం ది గోట్ లైఫ్ (the goat life)అనే మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇందులో పృథ్వీ రాజ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. చిరంజీవి గారు సైరా సినిమా అప్పుడు ఫోన్ చేసి ఒక క్యారక్టర్ చెయ్యమని అడిగారు.అప్పుడు ది గోట్ లైఫ్ సినిమాలో బిజీగా ఉన్నానని  చెప్పాను. ఆ తర్వాత గాడ్ ఫాదర్ సినిమాని డైరెక్ట్ చెయ్యమని అడిగారు. అప్పుడు కూడా అదే మాట చెప్పాను. దాంతో  నేను అడిగిన ప్రతి సారి ఇదే మాట చెప్తున్నావని చిరు గారు అన్నారు అని చెప్పాడు. ఇప్పుడు పృథ్వీ చెప్పిన ఈ మాటలతో గోట్ లైఫ్ ఎంత ప్రెస్టేజియస్ట్ మూవీ నో అర్ధం అవుతుంది.ఈ సారి అవకాశం వస్తే మాత్రం చిరుతో కలిసి నటిస్తానని చెప్పాడు.

ఇక ది గోట్ లైఫ్ ఈ నెల 29 న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతుంది. 90 వ దశకంలో నజీబ్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకి వెళ్ళాడు. ఈ సందర్భంగా అతను ఎదుర్కున్న కొన్ని  కఠినమైన పరిస్థితుల ఆధారంగా ఆ మూవీ  రూపొందింది. 2009 లోనే మూవీని మొదలుపెడదామని అనుకున్నారు. కానీ సరిపడ  బడ్జెట్ లేక 2018 లో షూటింగ్ ని ప్రారంభించారు. షూటింగ్ సమయంలో ఎన్ని  ఆటంకాలు ఎదురైనా కూడా పూర్తి చేసారు. పృథ్వీ రాజ్ తన క్యారక్టర్ కోసం ఎంతగానో కష్టపడ్డారు. 2008 లో ఈ ఈ కథ పుస్తకం రూపంలో వచ్చింది.ప్రముఖ ప్రతిష్టాత్మక సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేస్తుంది.



Source link

Related posts

ఓటీటీ వలయంలో తెలుగు సినిమా.. ప్రమాదం అంచున నిర్మాత!

Oknews

Komatireddy Venkat Reddy Jagadish Reddy Makes Accuses Eachother In Nalgonda | Komatireddy Vs Jagadish Reddy: కేసీఆర్ తర్వాత జైలుకు వెళ్లేది ఆ మాజీ మంత్రే

Oknews

ఆర్జీవీ డెన్ లో అమితాబ్ బచ్చన్..వ్యూహం త్వరలో!

Oknews

Leave a Comment