మెగాస్టార్ చిరంజీవి అండ్ ఆయన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు నాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.సింగల్ హ్యాండ్ తో తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించగల మగధీరులు. ఇద్దరకీ కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు. అలాగే కంబైన్డ్ గా ఎప్పటినుంచో అభిమాన ఆచారంగా వస్తున్న మెగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరకీ సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ఎట్రాక్షన్ గా మారింది.
చిరు ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. తన కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీ ని ఈ సారి చాలా గట్టిగా చెప్పడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల అవ్వబోతుంది. ఈ మేరకు అధికారకంగా కూడా ప్రకటన వచ్చింది. ఇక రెండు సంవత్సరాలకి క్రితమే పవన్ మూవీ హరిహరవీరమల్లు స్టార్ట్ అయ్యింది చారిత్రక నేపథ్యంతో కూడిన ఆ కథలో పవన్ వీరమల్లు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు పవన్ వీరమల్లు కూడా 2025 సంక్రాంతి బరిలో నిలవడం ఖాయమనే వార్తలు చాలా గట్టిగానే వస్తున్నాయి.అదే కనుక జరిగితే బాక్స్ ఆఫీస్ వద్ద చిరు పవన్ ల వార్ తప్పదు. సోషల్ మీడియాలో ఈ వార్తలు చూస్తున్న మెగా ఫ్యాన్స్ మాత్రం ఇద్దరు ఒకే సారి ఇంత వరకు ఎప్పుడు రాలేదు ఇక ముందు కూడా రారని అంటున్నారు. ఒక వేళ ఆ పరిస్థితే వస్తే ఇద్దరు మాట్లాడుకొని తమ రెండు సినిమాల మధ్య ఒక నెల గ్యాప్ అయినా ఉండేలా చూసుకుంటుంటారని అంటున్నారు.
ఇక విశ్వంభర లో మెగా స్టార్ కాలాన్ని జయించే వీరుడుగా నటించబోతున్నాడు. ఇక పవన్ వీరమల్లు లో ఒక సామ్రాజ్యాన్ని రక్షించే ఒక యోధుడుగా పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తున్నాడు. విశ్వంభర కి డైనమిక్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా వీరమల్లు కి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.రెండు సినిమాలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి.