EntertainmentLatest News

చిరంజీవి గురించి నోరు జారిన కీర్తి సురేష్‌.. ఆమెను ఆడుకుంటున్న నెటిజన్లు!


ఒకప్పుడు ఒక కళాకారుడు పాపులర్‌ అవ్వాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. జనం వారి టాలెంట్‌ను గుర్తించాలంటే ఎంతో టైమ్‌ పట్టేది. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మీడియా వల్ల అదెంతో సులభంగా మారింది. ఒక్కరోజులో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నవారు ఉన్నారు. అలాగే సినిమా సెలబ్రిటీస్‌ కూడా మీడియా వల్ల ప్రజల్లోకి తమ అభిపాయ్రాలను సులభంగా తీసుకెళ్ళగలుగుతున్నారు. ఒక విధంగా మీడియా వల్ల వారికి మేలు జరుగుతున్నా, మరోవైపు అదే మీడియా వల్ల కొన్ని ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొంటున్నారు. దానికి ఈమధ్యకాలంలో ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. 

కొన్ని సందర్భాల్లో ఏ సమాధానం చెబితే ఏమవుతుందో తెలియని పరిస్థితి సెలబ్రిటీల్లో నెలకొని ఉంటుంది. తాజాగా మీడియా అడిగిన ఓ ప్రశ్నకు హీరోయిన్‌ కీర్తి సురేష్‌ ఇరకాటంలో పడ్డారు. తమిళనాడు మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన సమాధానం వల్ల విపరీతమైన ట్రోలింగ్‌కి గురవుతున్నారు. సాధారణంగా ఏ ఇంటర్వ్యూలో అయినా సెలబ్రిటీస్‌కి ఎదురయ్యే క్లిష్టమైన ప్రశ్నలు ‘మీకు ఏ హీరో అంటే ఇష్టం’ లేదా ‘మీకు ఏ హీరోయిన్‌ అంటే ఇష్టం’.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ఎవరికైనా కష్టమే. ఎందుకంటే ఒకరి పేరు చెబితే మిగతా వారు ఫీల్‌ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ఫీల్‌ అయినా కాకపోయినా వారి అభిమానులు మాత్రం తీవ్రమైన మనస్తాపానికి గురవుతారు. ఇదే పరిస్థితి కీర్తి సురేష్‌ విషయంలో కూడా జరిగింది. 

ఇటీవల ఓ తమిళ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి సురేష్‌ను ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగారు. ‘ఈ ఇద్దరు హీరోల్లో ఎవరు బెస్ట్‌ డాన్సర్‌ అని మీరు అనుకుంటున్నారు?’ అంటూ చిరంజీవి, విజయ్‌ పేర్లను ప్రస్తావించారు. ఒక అద్భుతమైన డాన్సర్‌గా చిరంజీవికి ఎప్పటి నుంచో మంచి పేరు ఉంది. అతని డాన్సుల వల్లే హీరోగా నిలదొక్కుకోగలిగాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ విషయంలో ఎంతో మంది యువ హీరోలు చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుంటారు. కానీ, ఆ ప్రశ్నకు కీర్తి సురేష్‌.. విజయ్‌ బెస్ట్‌ డాన్సర్‌ అని సమాధానం చెప్పింది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. మెగాస్టార్‌ ఫ్యాన్స్‌ కీర్తి సురేష్‌ చెప్పిన సమాధానాన్ని తప్పుబడుతున్నారు. ఆమెను విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. రకరకాల కామెంట్స్‌ పెడుతూ కీర్తిని ఆడుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఆమెకు హీరో విజయ్‌ అంటే ఇష్టమేమో.. అందుకే అతని పేరు చెప్పి ఉంటుంది అని సర్దిచెప్పుకుంటున్నారు. చిరంజీవి వీరాభిమానులు మాత్రం తమ హీరోని తక్కువ చేసి మాట్లాడినందుకు కీర్తి సురేష్‌ని దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. 



Source link

Related posts

Telangana Congress Second List : తెలంగాణ లో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల | ABP Desam

Oknews

అది ఉంటేనే నా వీడియోలు చూస్తారా అంటున్న సదా!

Oknews

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ అనే మాటకు నిజమైన అర్థం.. నందమూరి కళ్యాణ్‌రామ్‌!

Oknews

Leave a Comment