EntertainmentLatest News

చిరంజీవి, బాలకృష్ణ యుద్ధం మొదలైంది… ఫ్యాన్స్‌ బీ రెడీ!


టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలందరూ తమ తమ ప్రాజెక్టులతో ఫుల్‌ బిజీ అయిపోయారు. యంగ్‌ హీరోలతోపాటు చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్‌ హీరోలు కూడా కొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాల్లో కూడా ఎంతో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం చిరు, బాలయ్య అదే పనిలో ఉన్నారు. బాలకృష్ణ హీరోగా కొల్లి బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌, చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ చిత్రాలు శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. 

ప్రస్తుతం ఈ ఇద్దరు సీనియర్‌ హీరోలు పోరాట సన్నివేశాల్లో నిమగ్నమై ఉన్నారు. చిరంజీవి ఇటీవల ‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించిన ఓ భారీ యాక్షన్‌ షెడ్యూల్‌లో ఎంటర్‌ అయ్యారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని థ్రిల్లింగ్‌ యాక్షన్‌ సీక్వెన్సులను చిత్రీకరిస్తున్నారు. అలాగే బాలకృష్ణ తన 109వ సినిమా కోసం పవర్‌ఫుల్‌ యాక్షన్‌తో కూడిన సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు బాలకృష్ణ చేసిన ఫైట్స్‌కి పూర్తి భిన్నంగా ఈ సీక్వెన్స్‌లను ప్లాన్‌ చేశారు మేకర్స్‌. ఈ ఇద్దరు టాప్‌ హీరోలు ఈసారి యాక్షన్‌ పరంగా ఫ్యాన్స్‌ని మరింత థ్రిల్‌ చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని అర్థమవుతోంది. 

ఈమధ్యకాలంలో సీనియర్‌ హీరోల నుంచి యంగ్‌ హీరోల వరకూ అందరూ యాక్షన్‌నే నమ్ముకున్నట్టు కనిపిస్తున్నారు. ఇంతకుముందు తమ సినిమాల్లో మంచి కథ ఉండాలి, కథనం బాగుండాలి, ఆడియన్స్‌ని పంచ్‌ డైలాగులతో ఎంటర్‌టైన్‌ చెయ్యాలి.. ఇలాంటి ఆలోచనలతో ఉన్న హీరోలందరూ ఒక్కసారిగా యాక్షన్‌ వైపు వెళ్ళిపోతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి హీరో యాక్షననలో జోరు చూపించేందుకు రెడీ అయిపోతున్నారు. సీనియర్‌ హీరోలు సైతం భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లలో యంగ్‌ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా పెర్‌ఫార్మ్‌ చేస్తున్నారు. సీనియర్‌ హీరోలు అంత యాక్టివ్‌గా ఫైట్స్‌ చేస్తూ ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తుంటే.. ఇక తమ పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకునే స్టేజ్‌కి వచ్చేస్తున్నారు యంగ్‌ హీరోలు. వాటిలోనే ఏదో కొత్తదనం చూపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సీనియర్‌ హీరోలైనా, యంగ్‌ హీరోలైనా ఇలాంటి థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌పైనే దృష్టి పెడుతున్నారు తప్ప కథ, కథనం, చక్కని డైలాగులతో ఆడియన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం మాత్రం ఎవ్వరూ చెయ్యడం లేదు. ఒకప్పుడు యాక్షన్‌ సినిమాలు కొందరికే పరిమితం అయ్యేవి. ఇప్పుడలా కాకుండా ప్రతి ఒక్కరూ అదే పంథాలో ముందుకు వెళుతున్నారు. 



Source link

Related posts

ఆగస్ట్‌ 15.. సంక్రాంతిని మించి పోయిందే.. ఎలాగంటే?

Oknews

BJP Leader Babu Mohan Has Announced That He Will Not Contest In Upcoming Telangana Elections

Oknews

ACB Raids On HMDA Former Director Shiva Balakrishna | ACB Raids On HMDA Former Director Shiva Balakrishna

Oknews

Leave a Comment