మెగాస్టార్ మోస్ట్ ప్రేస్టేజియస్ట్ మూవీ విశ్వంభర. 2025 సంక్రాంతికి కానుకగా జనవరి 10 న విడుదల అవుతున్న ఈ మూవీ మీద మెగా అభిమానుల్లోను ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి. సోషియో ఫాంటసీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో త్రిష ఒక హీరోయిన్ గా అలరించబోతుంది. తాజాగా ఇంకో ఇద్దరు హీరోయిన్లు చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
కామెడీ నటుడు సునీల్ హీరోగా వచ్చిన పూలరంగడులో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపుని పొందిన నటి ఇషాచావ్లా. అలాగే బీరువా చిత్రం ద్వారా గుర్తింపు పొందిన భామ సురభి.ఇప్పుడు వీళ్లిద్దరు విశ్వంభర లో నటిస్తున్నారు. ఆల్రెడీ దర్శకుడు వశిష్ట ఆ ఇద్దరు పాల్గొనే కొన్ని సన్నివేశాలని కూడా చిత్రీకరించాడు.ఈ నెల 26 నుంచి జరగబోయే కొత్త షెడ్యూల్ లో కూడా ఆ ఇద్దరు పాల్గొనబోతున్నారు.ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలతో విశ్వంభర రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకుంటుందనే విషయం అందరకి అర్ధం అయ్యింది.
కాకపోతే ఇషా చావ్లా, సురభి లు ఎలాంటి క్యారెక్టర్స్ లో నటిస్తున్నారనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ విశ్వంభర ని నిర్మిస్తుండగా మిగతా క్యారక్టర్ ల వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి.ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.