GossipsLatest News

చిరుకి ఊపిరి సలపడం లేదు


మెగాస్టార్ చిరంజీవి కి ఇప్పుడు ఊపిరి కూడా సలపడం లేదు, అంటే ఆయన షూటింగ్ తో బిజీగా వున్నారు అనుకుంటున్నారేమో, కాదు.. మెగాస్టార్ కి పద్మవిభూషణ్ బిరుదు వచ్చిన సందర్భంగా చిరుని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటుగా జర్నలిస్ట్ లు, ఆయన్ని అభిమానించే అభిమానులు మెగాస్టార్ ఇంటికి క్యూ కడుతున్నారు. చిరుకి ప‌ద్మ‌విభూష‌ణ్ ప్రకటించిన క్షణం నుంచే చిరు ఇంటికి రద్దీ పెరిగిపోయింది.

ఆయన కుటుంబ సభ్యులైన వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు ఫ్యామిలీ, నిహారిక, లావణ్య త్రిపాఠి, సాయి ధరమ్ తేజ్ ఇలా ఒక్కొక్కరిగా మెగాస్టార్ ఇంటికి చేరుకొని అభినందనలు తెలిపిన వీడియోస్, ఫొటోస్ వైరల్ గా మారగా.. ఈమధ్యలో ఇండస్ట్రీ ప్రముఖులు, పిఆర్వోస్ ఇలా అందరూ మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలియజేసి వచ్చారు. దర్శకుడు మారుతి దగ్గర నుంచి వసిష్ఠ వరకు అందరూ మెగా ఇంటికి క్యూ కట్టారు.

దానితో మెగాస్టార్ చిరంజీవి కి ఊపిరి కూడా సలపడం లేదు, ఆయనకి కనీసం రెస్ట్ తీసుకునే సమయం కూడా దొరికేలా కనిపించడం లేదు.



Source link

Related posts

కళ్యాణ్‌ని కంటతడి పెట్టించిన లెటర్!

Oknews

Is Janhvi Kapoor Getting Ready for Marriage? జాన్వీ.. పెళ్ళికి ఎందుకంత తొందర

Oknews

దొంగను తరిమికొట్టిన తల్లి,కూతుళ్లకు నార్త్ జోన్ డీసీపీ సన్మానం..!

Oknews

Leave a Comment